Dailyhunt
నిలకడగా బంగారం, వెండి ధరలు

నిలకడగా బంగారం, వెండి ధరలు

VIDHATHA 2 weeks ago

దివారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,52,350 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,39,650 వద్ద నిలిచింది.

కిలో వెండి ధర రూ. 2,80,000 వద్ద కొనసాగుతుంది.

విధాత, హైదరాబాద్ : పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం బంగారం, వెండి ధరల మీద కొనసాగుతుంది. ఆదివారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,52,350 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,39,650 వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ. 2,80,000 వద్ద కొనసాగుతుంది.

పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో సాధారణంగా పెట్టుబడిదారులు అత్యంత సురక్షితమైన ఆస్తిగా భావించే బంగారం వైపు మళ్లుతారు. దీనివల్ల డిమాండ్ పెరిగి ధరలు రికార్డు స్థాయిలకు చేరుకుంటాయి. అయితే అందుకు భిన్నంగా ఈసారి కేవలం యుద్ధం మాత్రమే కాకుండా అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదల, అమెరికన్ డాలర్ బలపడటం వంటి విరుద్ధమైన అంశాలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. ఫలితంగా పసిడి ధరలు హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి.

అయితే ఈ పరిస్థితి శాశ్వతం కాదని మోర్గాన్ స్టాన్లీ బ్యాంక్ అంచనా వేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి లేదా 2026 నాటికి పరిస్థితుల్లో మార్పు రావచ్చు అని, అమెరికా వడ్డీ రేట్ల తగ్గింపు ప్రక్రియ మొదలైతే, మళ్లీ బంగారానికి డిమాండ్ పెరిగే అవకాశం ఉందని చెబుతుంది.

2026 ద్వితీయార్థం నాటికి బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సుకు 5,200 డాలర్ల మార్కును తాకవచ్చని ఈ బ్యాంక్ అంచనా వేస్తోంది. కేవలం యుద్ధ పరిణామాలతోనే బంగారం ధర పెరగదని, దేశాల ఆర్థిక విధానాలు, వడ్డీ రేట్ల గమనం కూడా ధరలను నిర్ణయిస్తాయని చెబుతుంది. ఒకప్పుడు భౌగోళిక రాజకీయ రక్షణ కవచంగా ఉన్న బంగారం, ఇప్పుడు సంక్లిష్టమైన ఆర్థిక సమీకరణాల మధ్య తన ఉనికిని చాటుకోవాల్సి వస్తోందని మోర్గాన్ స్టాన్లీ నివేదిక స్పష్టం చేస్తోంది. భవిష్యత్తులో బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకుంటాయని అంచనా వేస్తుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA