Dailyhunt

నిప్పుల కొలిమిలా తెలంగాణ.. ఏప్రిల్ 9 నుంచి హీట్‌వేవ్, 44°C హెచ్చరిక

VIDHATHA 3 weeks ago

తెలంగాణలో ఏప్రిల్ 9 నుంచి వేడి తీవ్రత ఉధృతం కానుంది. పలు జిల్లాల్లో 44°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. అదిలాబాద్​ నుండి అలంపూర్​ దాకా వడదెబ్బల ప్రభావం ఉంటుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి.

Telangana Heatwave Alert: Temperatures to Hit 44°C from April 9

విధాత తెలంగాణ డెస్క్​ | హైదరాబాద్:

Telangana Heatwave Alert| బయట కాలు పెడితే మంటలు మండినట్లనిపించే రోజులు రాబోతున్నాయి. తెలంగాణలో వేసవి ఒక్కసారిగా తన అసలు రూపాన్ని చూపిస్తోంది. ఏప్రిల్ 9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా హీట్‌వేవ్ పరిస్థితులు తీవ్రంగా మారనున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41°C నుంచి 44°C వరకు చేరనున్నాయంటూ, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇది సాధారణ ఎండ కాదు… తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారి తీసే స్థాయి వేడి అని అధికారులు చెబుతున్నారు.

ఇప్పటివరకు ఓ మోస్తరు చల్లని వాతావరణం కనిపించినా, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
రాబోయే రోజుల్లో తెలంగాణలో పొడి వాతావరణం, మండే ఎండలు, వేడి గాలులు విజృంభించనున్నాయి. అదిలాబాద్ నుంచి గద్వాల్ వరకు పలు జిల్లాల్లో 44°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. మిగతా ప్రాంతాల్లో కూడా కనీసం 2-3°C పెరుగుదల ఖాయం.

తదుపరి 24-48 గంటల్లో కొన్ని చోట్ల స్వల్ప వర్షాలు లేదా గాలివానలు కనిపించే అవకాశం ఉంది. కానీ ఇదేం వేసవికి బ్రేక్ కాదు… కేవలం చిన్న విరామం మాత్రమే. తరువాత మళ్లీ నిప్పులు ఖాయం. వాతావరణ శాఖ స్పష్టం చేస్తున్నదాని ప్రకారం, అసలు గేమ్ ఇప్పుడే మొదలవుతోంది!

బయట అడుగు పెడితే మంటలే.. తెలంగాణలో హీట్‌వేవ్ ప్రారంభం, 44°C హెచ్చరిక!

ఈ వేడి పెరుగుదల వెనుక ప్రధాన కారణం వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ తగ్గిపోవడం. దీంతో ఉత్తర నుంచి వచ్చే చల్లని ప్రభావం తగ్గిపోయి, పొడి వేడి గాలులు తెలంగాణను కమ్మేస్తున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణం కంటే ఎక్కువ వేడి రోజులు ఉండే అవకాశం ఉంది.

ఈ పరిస్థితుల్లో చిన్న నిర్లక్ష్యం కూడా ప్రమాదకరం:

వడదెబ్బ ప్రమాదం ఎక్కువగా ఉండే రోజులు ఇవి. కాబట్టి అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA