Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Numerology | ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను చేసుకుంటే అదృష్టమే.. సంఖ్యాశాస్త్రంలో ఏం చెబుతున్నారంటే..!

Numerology | ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను చేసుకుంటే అదృష్టమే.. సంఖ్యాశాస్త్రంలో ఏం చెబుతున్నారంటే..!

VIDHATHA 1 week ago

Numerology | ముఖ్యంగా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన అమ్మాయిలు తమ కుటుంబానికి, వివాహం తర్వాత భర్తకు అదృష్టం తీసుకొస్తారని న్యూమరాలజీలో చెబుతుంటారు.

Numerology | ప్రతి మనిషి జీవితంలోనూ పుట్టిన తేదీకి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని చాలామంది విశ్వసిస్తుంటారు. ముఖ్యంగా సంఖ్యాశాస్త్రం (Numerology) ప్రకారం కొన్ని తేదీల్లో జన్మించిన వారు ప్రత్యేక వ్యక్తిత్వం, అదృష్టం నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారని చెబుతుంటారు. అందులోనూ ముఖ్యంగా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన అమ్మాయిలు తమ కుటుంబానికి, వివాహం తర్వాత భర్తకు అదృష్టం తీసుకొస్తారని న్యూమరాలజీలో చెబుతుంటారు.

సంఖ్యా శాస్త్రం ప్రకారం 3 సంఖ్యకు అధిపతి గురు గ్రహం అని భావిస్తుంటారు. గురు గ్రహం జ్ఞానం, సంపద, గౌరవానికి ప్రతీక చెబుతుంటారు. అందుకే జన్మదినంలో ఈ సంఖ్య కలిగిన వారు తెలివైన, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారని అంటారు. ఇక పుట్టిన తేదీలో 3 సంఖ్య కలిగిన అమ్మాయిలు కుటుంబసభ్యులతో మంచి అనుబంధం కలిగి ఉంటారు. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు ఆవేశానికి లోనుకాకుండా ప్రశాంతంగా పరిష్కారాలు వెతుకుతారని చెబుతుంటారు. ఇంట్లో సానుకూల వాతావరణం ఉండేలా చూసే స్వభావం వీరిలో ఎక్కువగా ఉంటుందని సంఖ్యా శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

న్యూమరాలజీ ప్రకారం.. 3, 12, 21, 30 సంఖ్య కలిగిన అమ్మాయిలు జీవిత భాగస్వామికి ప్రతి విషయంలో తోడుగా నిలుస్తారు. కష్టకాలంలో ధైర్యం చెప్పడమే కాదు.. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడతారు. భర్త పురోగతికి ఏంతో తోడ్పతారు. ఆర్థిక వ్యవహారాల్లోనూ భర్త సరైన దారిలో వెళ్లేలా చూస్తారని అంటారు.

ఈ సంఖ్యలో జన్మించిన అమ్మాయిలకు నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటాయని భావిస్తారు. వారు ఇతరులను కూడా ప్రభావితం చేయగలరు. సమాజంలో గౌరవం పొందుతారు. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ బాధ్యతలు ఏ రంగంలో ఉన్నా సరే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంటారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA