Dailyhunt
"ఒక్క రాత్రిలో ఇరాన్ అంతం". రేపే కావచ్చు : ట్రంప్ సంచలన హెచ్చరిక

"ఒక్క రాత్రిలో ఇరాన్ అంతం". రేపే కావచ్చు : ట్రంప్ సంచలన హెచ్చరిక

VIDHATHA 3 weeks ago

రాన్‌పై అమెరికా తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన ట్రంప్, ఒకే రాత్రిలో దేశాన్ని పూర్తిగా తుడిచివేయగలమని వ్యాఖ్యానించారు. డెడ్‌లైన్ ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరిగాయి.

కాల్పుల విరమణ ప్రతిపాదనను 'సరిపోదు' అంటూ తిరస్కరించిన ట్రంప్ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ చర్చకు దారి తీశాయి.

"Entire Iran Can Be Wiped Out in One Night": Trump's Explosive Warning Before Deadline

"ఒక్క రాత్రిలో ఇరాన్ అంతం" - ట్రంప్ సంచలన హెచ్చరిక

ఇరాన్‌పై అమెరికా తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన ట్రంప్, అవసరమైతే ఒకే రాత్రిలో దేశాన్ని పూర్తిగా తుడిచివేయగలమని పేర్కొన్నారు. హోర్ముజ్ జలసంధి అంశంపై డెడ్‌లైన్ ప్రకటించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది.

⏳ ట్రంప్ ఇరాన్‌కు ఇచ్చిన గడువు

Countdown Timer

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తన దూకుడైన వ్యాఖ్యలతో అంతర్జాతీయ రాజకీయాల్లో కలకలం రేపారు. ఇరాన్‌పై అమెరికా తీసుకునే చర్యలపై స్పష్టమైన సంకేతాలు ఇస్తూ, అవసరమైతే "ఒకేరాత్రిలోరాన్​నుపూర్తిగాతుడిచిపెట్టగలం" అని హెచ్చరించడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు దారి తీసింది. ఈ వ్యాఖ్యలు సాధారణ రాజకీయ వ్యాఖ్యల కంటే చాలా తీవ్రమైనవిగా భావిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆయన ప్రకటించిన ఖచ్చితమైన డెడ్‌లైన్ పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది.

ఇరాన్ అణు సామర్థ్యానికి ప్రతీకగా నిలిచిన బుషెహర్ అణు ప్లాంట్

ఇరాన్ హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ట్రంప్ స్పష్టం చేశారు. "ఇరాన్ మొత్తం ఒకే రాత్రిలో ముగిసిపోవచ్చు… అది రేపే కావచ్చు" అంటూ చేసిన వ్యాఖ్యలు ఆయన ఉద్దేశ్యాన్ని బహిర్గతం చేశాయి. సోషల్ మీడియా వేదిక Truth Social లో ఆయన చేసిన పోస్టులు మరింత వివాదాస్పదంగా మారాయి. పవర్ ప్లాంట్లు, బ్రిడ్జ్‌లు, కీలక మౌలిక వసతులపై సమన్వయ దాడులు జరుగుతాయని, "Tuesday 8:00 PM (Eastern Time)" అంటూ ఖచ్చితమైన సమయాన్ని కూడా పేర్కొనడం ద్వారా ఒత్తిడిని పెంచారు. ఈ ప్రకటనలు కేవలం హెచ్చరికలేనా, లేక సైనిక చర్యలకు ముందస్తు సంకేతాలా అన్న దానిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

ట్రంప్ హెచ్చరికల్లో ప్రస్తావనకు వచ్చిన ఇరాన్ కీలక మౌలిక వసతుల్లో పవర్ ప్లాంట్లు ఒకటి

ట్రంప్ వ్యాఖ్యల్లో తీవ్రత మరింత పెరిగింది. ఇరాన్‌లోని కీలక మౌలిక వసతులను పూర్తిగా ధ్వంసం చేస్తామని ఆయన హెచ్చరించారు. "వారికి బ్రిడ్జ్‌లు ఉండవు, పవర్ ప్లాంట్లు ఉండవు… ఏమీ మిగలదు" అన్న వ్యాఖ్యలు పరిస్థితి ఎంత ప్రమాదకర దశలోకి వెళ్లిందో చూపిస్తున్నాయి. ముందుగా చేసిన హెచ్చరికల కంటే కూడా తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఆయన సంకేతాలు ఇచ్చారు. ఇది కేవలం రాజకీయ ఒత్తిడి కాదు, అవసరమైతే యుద్ధానికి సిద్ధమనే సందేశంగా కూడా విశ్లేషకులు భావిస్తున్నారు.

ఉద్రిక్తతల నడుమ ప్రశాంతంగా కనిపిస్తున్న ఇరాన్ రాజధాని టెహ్రాన్

45 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనపై ట్రంప్ స్పందిస్తూ "ముఖ్యమైన అడుగే… కానీ సరిపోదు" అని పేర్కొన్నారు. తుది నిర్ణయం తన చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఇరాన్ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. తాత్కాలిక విరమణ వల్ల ప్రత్యర్థులు మరింత బలపడతారని టెహ్రాన్ అభిప్రాయపడింది. మరోవైపు ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మరింత చర్చకు దారి తీశాయి. ఇరాన్ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడతారని, వారికి ఆయుధాలు అందితే పరిస్థితి మారిపోతుందని చెప్పారు. "బాంబుల శబ్దమే వారికి స్వేచ్ఛకు మార్గం" అన్న వ్యాఖ్య తీవ్ర విమర్శలకు కారణమైంది. అదనంగా, ఇరాన్ చమురుపై తన ఆసక్తిని మరోసారి వ్యక్తం చేస్తూ, అయితే అమెరికా ప్రజలు అలాంటి చర్యను మద్దతు ఇస్తారా అన్న సందేహాన్ని కూడా వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA