Dailyhunt
పాతబస్తీలో సర్ అయినా. వ్యవహారమంతా ఎంఐఎం చేతుల్లోనే..!

పాతబస్తీలో సర్ అయినా. వ్యవహారమంతా ఎంఐఎం చేతుల్లోనే..!

VIDHATHA 0 months ago

హైదరాబాద్ పాతబస్తీలో SIR ప్రక్రియపై వివాదం రగిలింది. ఎంఐఎం జోక్యం ఆరోపణలపై బీజేపీ ఫిర్యాదు చేయగా ఎన్నికల సంఘం చర్యలపై ఆసక్తి నెలకొంది.

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ పాత బస్తీ ఎంఐఎం పార్టీ అడ్డా అనడంలో సందేహం లేదు.

ముస్లిం మైనార్టీలకు ప్రతినిధిగా చలామణి అవుతున్న ఆ పార్టీ పాతబస్తీలోని మెజార్టీ ముస్లిం జనాభా అండతో తను అనుకున్నదే చేస్తుంటుంది. రాష్ట్రంలో అధికారంలో ఏ పార్టీ ఉన్నా..పాతబస్తీలో మాత్రమే ఎంఐఎం పార్టీదే రాజ్యం అన్నట్లుగా ఆ పార్టీ నాయకులు, ఓవైసీ సోదరులు హవా నడిపిస్తుంటారు. ఎన్నికల సందర్బంగా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా వారిదే ఆధిపత్యం అన్నట్లుగా వ్యవహరించడం తరుచూ వివాదస్పదం అవుతుంటుంది.

ఇదంతా ఒక ఎత్తయితే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్(SIR) ప్రక్రియ అమలు సైతం ఎంఐఎం నేతలు చేతుల్లోకి తీసుకున్నారంటూ రేగిన వివాదం సంచలనం రేపుతుంది. పాతబస్తీ బండ్లగూడ పోలింగ్ బూత్ 86లో బీఎల్ వోలు సర్ ప్రక్రియ చేపట్టారు. అయితే ఆ పని చేయాల్సిన బీఎల్ వోల నుంచి స్థానిక ఎంఐఎం నేతలు యూజర్ ఐడి, పాస్ వర్డ్‌లను తీసుకుని తమకు అనుకూలంగా సర్ జాబితాను మార్చుకుంటున్నారంటూ వివాదం చెలరేగింది. దీనిపై బీజేపీ నాయకత్వం రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. మరి బీజేపీ ఫిర్యాదుపై ఎన్నికల సంఘం ఏం చర్యలు తీసుకోనుంది..ఎంఐఎం ఎలా స్పదించనుందన్నది ఆసక్తికరంగా మారింది.

బయటపడ్డ ఆప్‌ అంతర్గత పోరు.. రాఘవ్‌ ఛద్దాను అందుకే దూరం పెట్టారా?
వీళ్ల పాలన పాడుగాను.. బీపీ లేస్తుంది: కాంగ్రెస్ పాలనపై కూనంనేని ఫైర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA