Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రైవేట్ ఆసుపత్రులపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ప్రైవేట్ ఆసుపత్రులపై సుప్రీంకోర్టు ఆగ్రహం

VIDHATHA 4 days ago

పేదలకు ఉచిత వైద్యం అందించాలంటూ ప్రైవేట్ ఆసుపత్రులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 51 ఆసుపత్రులకు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.

న్యూఢిల్లీ : ప్రైవేటు, కార్పోరేట్ ఆసుపత్రులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిందేనని, పేదలకు ఉచితంగా 10శాతం ఐపిడి, 25% ఓపిడి సేవలు అందించాలని స్పష్టం చేసింది. రాయితీ భూముల్లో ఆసుపత్రులు కట్టుకుని.. నిబంధనలు పాటించరా? అని నిలదీసింది.

2018 తీర్పును అమలు చేయని ఆసుపత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 51 ఆసుపత్రులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. నియమాలు, కోర్టు ఉత్వర్వుల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. సామాన్యులకు వైద్యం అందుబాటులో ఉండాల్సిందేనని స్పష్ఠీకరించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA