Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైతులకు క్షమాపణలు చెబుతున్నాం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

రైతులకు క్షమాపణలు చెబుతున్నాం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

VIDHATHA 22 hrs ago

యాసంగి ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్షమాపణలు తెలిపారు. పది రోజుల్లో కొనుగోలు పూర్తి చేస్తామని చెప్పారు.

యాసంగి ధాన్యం కొనుగోలులో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులకు ప్రభుత్వం తరుపునా రైతులకు క్షమాపణలు చెబుతున్నానని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కల్లాల వద్ద రైతులు రోజుల తరబడి ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం అని, ఇందుకు నేను చింతిస్తున్నానని, తమ ప్రభుత్వం రైతులకు అండగా నిలబడేందుకు కృషి చేస్తుందని, పది రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. రైతులు, ప్రతిపక్షాలు, మీడియా లేవనెత్తిన ధాన్యం కొనుగోలు సమస్యలను మేం సానుకూలంగా తీసుకుంటామని, అందరూ సహకరిస్తే పది రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తవుతుందన్నారు.

ధాన్యం అనుకున్నదానికంటే మూడు నాలుగు రెట్లు అధికంగా ఉత్పత్తి రావడం, బెంగాల్ ఎన్నికలలో హమాలీల కొరత, కొందరు మిల్లర్ల బ్లాక్ మెయిల్ రాజకీయం ధాన్యం కొనుగోలు సమస్యలు అధికం కావడానికి కారణం అయ్యాయని రాజగోపాల్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, సివిల్ సఫ్లయ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ధాన్యం కొనుగోలు సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారన్నారు. చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం ధాన్యం కొనుగోలు సమస్యల పరిష్కారం కోసం ఇక్కడ అంకిరెడ్డి గూడెంలో 1లక్ష 50వేల క్వింటాళ్ల ధాన్యం నిల్వకు ప్రైవేటు గోదాంను స్వాధీనం చేసుకున్నామని, సూర్యాపేట వద్ద మరో ప్రైవేట్ గోదాంను కూడా తీసుకుని ధాన్యం కొనుగోలు, తరలింపు వేగవంతం చేస్తామని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA