Dailyhunt
రయ్ రయ్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

రయ్ రయ్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

VIDHATHA 3 weeks ago

బుధవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 3,980 పెరిగి రూ. 1,53,820కి చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 3,650పెరిగి రూ.

1,41,000వద్ద నిలిచింది. కిలో వెండి ధర సైతం రూ.10,000పెరిగి రూ. 2,65,000పెరిగింది.

విధాత, హైదరాబాద్ : పశ్చిమాసియాలో ఇరాన్ తో అమెరికా తాత్కాలిక యుద్ద విరమణ సీజ్ ఫైర్ ఒప్పందం నేపథ్యంలో బంగారం, వెండి ధరలు పెరుగుదలను నమోదు చేశాయి. బుధవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 3,980 పెరిగి రూ. 1,53,820కి చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 3,650పెరిగి రూ. 1,41,000వద్ద నిలిచింది. కిలో వెండి ధర సైతం రూ.10,000పెరిగి రూ. 2,65,000పెరిగింది.

ఇరాన్‌తో రెండు వారాల పాటు కాల్పుల విరమణ జరిగినట్లుగా ట్రంప్ ప్రకటించారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. కానీ బంగారం, వెండి ధరలు మాత్రం హడలెత్తిస్తున్నాయి. అసలే ప్రస్తుతం పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ నడుస్తోంది. ఇలాంటి తరుణంలో ధరలు అమాంతంగా పెరగడంతో సామాన్యులు లబోదిబో అంటున్నారు. పరిస్థితి చూస్తుంటే ఇకముందు బంగారం, వెండి ధరలు మళ్ళీ గరిష్ట నమోదు దిశగా దూసుకెళ్లవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

"ఈ రాత్రికే ఒక నాగరికత అంతం" - ఇరాన్‌కు ట్రంప్ భీకర హెచ్చరిక..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA