Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
షాకింగ్ ఘటన.. రూ.2వేలు అద్దె చెల్లించలేక యజమాని వద్దకు భార్య, బిడ్డ

షాకింగ్ ఘటన.. రూ.2వేలు అద్దె చెల్లించలేక యజమాని వద్దకు భార్య, బిడ్డ

VIDHATHA 1 week ago

గుజరాత్ రాష్ట్రం మొర్బీ జిల్లాలో ఘోరమైన ఘటన జరిగింది. సభ్య సమాజం తలదించుకోవాల్సిన అంశం. గుజరాత్ వెలిగిపోతుందంటూ బీజేపీ పెద్దలు దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు.

అయితే ఇందుకు విరుద్ధంగా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయనేది ఈ ఘటన ద్వారా వెల్లడవుతున్నది.

విధాత, హైదరాబాద్:

ఇంటి యజమానికి ప్రతి నెలా అద్దె మొత్తం రూ.2వేలు చెల్లించలేక తన భార్యతో పాటు కుమార్తెను కూడా అతని వద్దకు పంపించాడు. గత నాలుగైదు నెలలుగా వారిద్దరిపై లైంగిక దాడి జరుగుతోంది. ఈ విషయం భార్య తల్లిదండ్రులకు తెలియడంతో అవాక్కైన వారు మోర్బీ సిటీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు.. ఇంటి యజమానితో పాటు బాధితురాలి భర్తపై బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్లతోపాటు పోక్సో కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

గుజరాత్‌లో నీటి లభ్యత లేకపోవడం కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ కారణంగా నిరుపేద కుటుంబాలు ఉపాధి కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్తున్నాయి. ఇదే తరహాలో ఒక కుటుంబం మోర్బీ జిల్లాకు ఆరు నెలల క్రితం ఉపాధి వెతుక్కుంటూ వెళ్లింది. ఈ కుటుంబంలో యజమానితో పాటు, భార్య, వారి పదమూడు సంవత్సరాల కుమార్తె కూడా ఉన్నది. నిలువ నీడ కోసం ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ప్రతి నెలా రూ.2 వేలు చెల్లించేలా యజమానితో ఒప్పందం చేసుకున్నారు. ఒకటి రెండు నెలలు బాగానే చెల్లించినా ఆ తరువాత చెల్లించేందుకు డబ్బులు లేకపోవడాన్ని ఇంటి యజమాని గమనించాడు. ఇదే సదవకాశంగా భావించి, ఒత్తిడి పెంచినప్పటికీ కిరాయిదారుడు చేతులెత్తేశాడు. అందుకు ప్రతిగా తన భార్యను పంపిస్తానని చెప్పడంతో యజమాని ఓకే చెప్పాడు. ఆమెపై పలుమార్లు అఘాయిత్యం జరపడమే కాకుండా బంధువులకు కూడా అవకాశం కల్పించాడు. తల్లితో పాటు 13 సంవత్సరాల కుమార్తెను కూడా లైంగికంగా లోబర్చుకున్నాడు. తన ఇంటితో పాటు టంకారా, ఇతర ప్రాంతాలలో పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు.

ఈ విషయం భార్య తల్లిదండ్రులకు తెలియడంతో హతాశులై మే 1వ తేదీన మోర్బీ సిటీ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. గత నాలుగైదు నెలలుగా ఇంటి యజమాని తన కుమార్తెతో పాటు, మనవరాలిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడని ఫిర్యాదులో తెలిపారు. మనవరాలు మైనర్ అని వివరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంటి యజమాని (55) ని, బాధిత మహిళ భర్తను కూడా అరెస్టు చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఒక రోజు కస్టడీకి తీసుకుని విచారించి తిరిగి జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. ఇంటి యజమాని బంధువులు పరారీలో ఉండగా వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Read Also |

మోదీ పర్యటన..భారత్ కు చోళుల రాగి శాసనాలను తిరిగిచ్చేసిన నెదర్లాండ్
Mr. Work From Home Review: 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' రివ్యూ.. తప్పక చూడాల్సిన చిత్రం!
బండి సంజయ్ ని మంత్రి పదవి నుంచి తొలగించాలి: ప్రధానికి బాధితురాలి లేఖ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA