Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రీ అమ్మ భగవాన్ బోధనల నేపథ్యంలో "ఏదైనా సాధ్యమే" మూవీ

శ్రీ అమ్మ భగవాన్ బోధనల నేపథ్యంలో "ఏదైనా సాధ్యమే" మూవీ

VIDHATHA 1 week ago

శ్రీ అమ్మ భగవాన్ బోధనల ఆధారంగా రూపొందుతున్న "ఏదైనా సాధ్యమే" మూవీ టైటిల్ హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో ఆవిష్కరించారు. ఆధ్యాత్మికత, మానవ సంబంధాల నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోంది.

▪️ ఫిలిం చాంబర్‌లో టైటిల్ ఆవిష్కరణ

ఆధ్యాత్మికతను, మానవ సంబంధాలను మేళవిస్తూ శ్రీ ఆది లక్ష్మి పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న సరికొత్త చిత్రం "ఏదైనా సాధ్యమే". ఈ సినిమాకు "దైవం తోడుంటే.." అనేది ఉపశీర్షిక. ఈ చిత్ర టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు మద్దూరి రాజా, నిర్మాత అనిల్ మునగనూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎన్. సుబ్రహ్మణ్యం, చిత్ర బృందం పాల్గొన్నారు.

ప్రతి మనిషి తన ఇష్ట దైవంతో బలమైన అనుబంధాన్ని పెంచుకోవడం ద్వారా జీవితంలోని దుఃఖాల నుండి, బాధల నుండి ఎలా విముక్తి పొందవచ్చనే అంశాన్ని ఈ సినిమా ద్వారా చూపించనున్నారు. ముఖ్యంగా ఈ చిత్ర నిర్మాణం మొత్తం "శ్రీ అమ్మ భగవాన్" బోధనల ఆధారంగా రూపొందుతోందని చిత్ర యూనిట్ ప్రకటించింది.

సినిమా కథనం ప్రధానంగా శ్రీ అమ్మ భగవాన్ చెప్పిన ఈ ఐదు సూత్రాల చుట్టూ తిరుగుతుందని వెల్లడించారు. "నీవు ప్రత్యేకమైన వ్యక్తివి, నీ ఆంతరంగిక ప్రపంచమే బాహ్య ప్రపంచం, వ్యక్తి లేడు, వ్యక్తిత్వాలు మాత్రమే ఉంటాయి, అంతర్గత సత్యము, జీవితమంటేనే బాంధవ్యాలు." ఈ అంశాల ఆధారంగానే సినిమా కథనం ఉంటుందని తెలిపారు.

కథ, మాటలు, సాహిత్యాన్ని అందిస్తూ నిర్మిస్తున్న అనిల్ కుమార్ మునగనూరి మాట్లాడుతూ.. దేశానికి యువత ఎంతో ముఖ్యం. కానీ చాలా మంది నిరాశ లో, డిఫ్రెషన్ లో కూరుకు పోతున్నారు. ఒక వ్యక్తికి జీవితంలో భగవంతుడి బంధం ఉన్నట్లయితే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో, అసాధ్యాలు సుసాధ్యాలుగా మారుతాయి అనేది ఈ చిత్రం ద్వారా చెప్పదలుచుకున్నాము. ఆధ్యాత్మిక బోధనల ఆధారంగా ఈ చిత్రం తెరకేక్కుతుంది. తమ ఇష్టందైవంతో అనుసంధానమైతే అద్భుతాలు జరుగుతాయి.. అని చెప్పారు.

ఈ చిత్రానికి అనిల్ మునగనూరి కథ, మాటలు, సాహిత్యాన్ని అందించడమే కాకుండా నిర్మాణ బాధ్యతలను కూడా చేపట్టారు. రాజా మధురి దర్శకత్వం వహిస్తుండగా, రమేష్ సినిమాటోగ్రఫీని, ఫణీంద్ర ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడిస్తామని చిత్ర బృందం పేర్కొంది.

బ్యానర్ : శ్రీ ఆది లక్ష్మి పిక్చర్స్
నిర్మాత: అనిల్ మునగనూరి
దర్శకుడు: మద్దూరి రాజా
కథ, మాటలు, సాహిత్యం: అనిల్ మునగనూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుబ్రహ్మణ్యం
సినిమాటోగ్రఫీ: రమేష్
ఎడిటింగ్: ఫణీంద్ర
పీఆర్ఓ: అశోక్ దయ్యాల

చివరి గింజ వరకు కొంటాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA