Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Summer | భానుడి భగభగలు.. భారీగా నమోదవుతున్న పగటి ఉష్ణోగ్రతలు..!

Summer | భానుడి భగభగలు.. భారీగా నమోదవుతున్న పగటి ఉష్ణోగ్రతలు..!

VIDHATHA 3 days ago

Summer | రాష్ట్ర వ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. పగటి పూట నిప్పులు కక్కిస్తున్నాడు. ఆ ఎండ వేడిమికి ప్రజలు తట్టుకోలేక విలవిలలాడిపోతున్నారు.

ఇంట్లో నుంచి బయటకు కాలు పెట్టలేని పరిస్థితి.

Summer | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. పగటి పూట నిప్పులు కక్కిస్తున్నాడు. ఆ ఎండ వేడిమికి ప్రజలు తట్టుకోలేక విలవిలలాడిపోతున్నారు. ఇంట్లో నుంచి బయటకు కాలు పెట్టలేని పరిస్థితి. పొద్దున 9 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇదే పరిస్థితి. అంతేకాదు అర్ధరాత్రి వరకు కూడా వేడి గాలుల తీవ్రత కొనసాగుతూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉక్కపోతను భరించలేక అల్లాడిపోతున్నారు.

బుధవారం నిర్మల్ జిల్లాలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, వరుసగా రెండో రోజూ అదేస్థాయిలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాల్లో 46.5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదై స్థానిక ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇక హైదరాబాద్ సిటీలో అత్యధికంగా కార్వాన్ ఏరియాలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మునగాల (సూర్యాపేట) - 46.5
ముత్తారం (పెద్దపల్లి) - 46.5
మందమర్రి (మంచిర్యాల) - 46.4
ధర్మపురి (జగిత్యాల) - 46.4
కేబీ ఆసిఫాబాద్ (కుమ్రం భీం) - 46.4
వైరా (ఖమ్మం) - 46.4
పాల్వంచ (భద్రాద్రి కొత్తగూడెం) - 46.4

కార్వాన్ - 43.4
చాంద్రాయణగుట్ట - 43.2
అంబర్‌పేట్ - 43
మలక్‌పేట్ - 42.6
ఏఎస్ రావు నగర్ - 42.6
అల్వాల్ - 42.6

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA