Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్వల్పంగా పెరిగిన బంగారం ధర

స్వల్పంగా పెరిగిన బంగారం ధర

VIDHATHA 22 hrs ago

సోమవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 320పెరిగి రూ. 1,59,380 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 300 పెరిగి రూ. 1,46,100కి చేరింది.

రూ.2,95,000వద్ద స్థిరంగా కొనసాగుతుంది.

పశ్చిమాసియాలో నెలకున్న యుద్ధ పరిస్థితులు కారణంగా బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. మార్కెట్‌లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు కొత్త నగల కొనుగోళ్లకు దూరంగా ఉంటున్నారు. సోమవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 320పెరిగి రూ. 1,59,380 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 300 పెరిగి రూ. 1,46,100కి చేరింది. రూ.2,95,000వద్ద స్థిరంగా కొనసాగుతుంది.

ప్రస్తుతం అమెరికా, ఇరాన్ దేశాల నుండి వస్తున్న పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ అనిశ్చితి కొనసాగుతుండటంతో పెట్టుబడిదారులు తీవ్ర అప్రమత్తత పాటిస్తున్నారు. ఇరు దేశాల మధ్య ఒప్పందం దాదాపు ఖరారైందని, కేవలం తుది వివరాలు మాత్రమే మిగిలి ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొనగా, హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచారన్న వార్తలను ఇరాన్ మీడియా తోసిపుచ్చింది. ఈ గందరగోళ పరిస్థితుల కారణంగా ముడి చమురు ధరలు అస్థిరంగా మారాయి, దీని ప్రభావం నేరుగా పసిడి, వెండి ధరలపై పడుతోంది.

యూఎస్ ఫెడరల్ రిజర్వ్ అధికారులు చేయబోయే తదుపరి ప్రకటనలు , అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం, రూపాయి విలువ బలపడటం , ముడి చమురు మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా ధరలు దాదాపు 7 శాతం మేర తగ్గడం ప్రపంచ ద్రవ్యోల్బణం నుండి కొంత ఉపశమనం దొరకడం వంటి పరిణామాలు బంగారం, వెండి ధరలలో మార్పులకు కారణం అవుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Bajaj Pulsar | స్పోర్టీ లుక్.. ప్రీమియం ఫీచర్లతో కొత్త బజాజ్ పల్సర్ N160 లాంచ్.. ధర ఎంతంటే..!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA