Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ EAPCET-2026 ఫలితాలు విడుదల

తెలంగాణ EAPCET-2026 ఫలితాలు విడుదల

VIDHATHA 1 week ago

ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ అడ్మిషన్ల ప్రవేశ పరీక్ష తెలంగాణ టీజీఈఏపీసెట్‌ (TGEAPCET-2026) ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్‌టీయూ-హెచ్‌లో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య వి.బాలకిష్టారెడ్డి తదితరులు విడుదల చేశారు.

ఇంజనీరింగ్‌లో 73.36 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

విధాత, హైదరాబాద్ : ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ అడ్మిషన్ల ప్రవేశ పరీక్ష తెలంగాణ టీజీఈఏపీసెట్‌ (TGEAPCET-2026) ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్‌టీయూ-హెచ్‌లో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య వి.బాలకిష్టారెడ్డి తదితరులు విడుదల చేశారు. ఇంజనీరింగ్‌లో 73.36 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంజనీరింగ్ పరీక్షకు 1,97,241 మంది విద్యార్థులు హాజరుకాగా, అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షకు 84,954 మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఇంజినీరింగ్‌ విభాగంలో ఎం. రుషి (ఉప్పల్‌) ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించగా.. అన్షుల్‌ (మూసాపేట) రెండో ర్యాంక్‌, ఎం. వంశీధర్‌రెడ్డి (పులివెందుల) మూడో ర్యాంక్‌, జె. రోషన్‌ మణిదీప్‌రెడ్డి (గుంటూరు) నాలుగో ర్యాంక్‌, ఎ. సాయినిఖిత్‌ (మహబూబ్‌నగర్‌) ఐదో ర్యాంక్‌ సాధించారు.ఆరో ర్యాంక్‌-ఎం.ఆస్నా ( మేడ్చల్), ఏడో ర్యాంక్‌- శరద్, మహేశ్వరీ (బంజారాహిల్స్), ఎనిమిదో ర్యాంక్‌- టి.శ్రేయాష్ రెడ్డి (కొండాపూర్), తొమ్మిదో ర్యాంక్‌-బొమ్మిరెడ్డి సమీరాజ్ రెడ్డి (ఎల్బీనగర్), పదో ర్యాంక్‌- రాపోలు జయంత్ శేఖర్ రెడ్డి (సుచిత్ర)లు సాధించారు.

ఫలితాలను తెలుసుకోవడానికి TG EAPCET 2026 Results" లింక్‌పై క్లిక్‌ చేయాలి
హాల్‌టికెట్ నంబర్‌, రిజిస్ట్రేషన్ నంబర్‌, జన్మతేదీ నమోదు చేయాలి. Submit బటన్‌పై క్లిక్‌ చేయాలి. స్కో ర్‌కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. భవిష్యత్తు అవసరాల కోసం డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రింట్‌ తీసుకోవాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA