Dailyhunt
తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీ

తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీ

VIDHATHA 4 days ago

తెలంగాణలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులను ప్రభుత్వం భర్తీ చేసింది. పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లను ప్రకటించారు.

తెలంగాణలో ఖాళీగా ఉన్న పలు నామినేటెడ్‌ పదవులను భర్తీ చేశారు.

పలు కార్పొరేషన్ల చైర్మన్ లు, వైస్ చైర్మన్ లను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. భర్తీ యైన వాటి వివరాలను టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ప్రకటించారు. 18 ఫెడరేషన్ లకు చైర్మన్ లను, 11 ఫెడరేషన్ లకు వైస్ ఛైర్మన్ లను ప్రకటించారు.

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ ఛైర్మన్‌ - బస్వరాజ్‌ శ్రీనివాస్‌.
వాషర్‌మెన్‌ కో-ఆపరేటివ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ - దాసరిరాజు అజయ్‌ కుమార్‌.
గీతకార్మికుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ - మోతుకూరి చంద్రశేఖర్‌ గౌడ్‌
పెరిక సహకార కార్పొరేషన్‌ ఛైర్మన్- దొంగారి వెంకటేశ్వర్లు.
మేర సహకార కార్పొరేషన్‌ ఛైర్మన్‌- సంగా వెంకటరాజం.
వాల్మీకి బోయ సహకార కార్పొరేషన్‌ ఛైర్మన్‌ - గట్టు తిమ్మప్ప
మున్నూరు కాపు సహకార కార్పొరేషన్‌ ఛైర్మన్‌ - బొమ్మ శ్రీరామ్‌
యాదవ సహకార కార్పొరేషన్‌ ఛైర్మన్‌ - ఎం.రఘునాథ్‌ యాదవ్‌
వడ్డెర సహకార కార్పొరేషన్‌ ఛైర్మన్‌ - గుంజ రేణుక నారాయణ
చేనేత అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ -దూదెం వెంకటరమణ
కమ్మ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ - బండి రమేష్‌
పద్మశాలి సహకార కార్పొరేషన్‌ ఛైర్మన్‌ -గూడురు శ్రీనివాస్‌
భట్టరాజ కోఆపరేటివ్‌ సొసైటీ ఫెడరేషన్‌ చైర్మన్‌- సీహెచ్‌ బాలరాజు
వెలమ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ -జువ్వాది నర్సింగ్‌రావు
గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార ఫెడరేషన్‌ ఛైర్మన్‌ - కొల్లె సరిత
లైవ్‌స్టాక్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ ఛైర్మన్‌ -చరణ్‌ కౌశిక్‌ యాదవ్‌
తెలంగాణ తెలుగు అకాడమీ ఛైర్మన్‌ -ప్రొ.వెంకటనారాయణ
తెలంగాణ గ్రామ పంచాయతీ ట్రైబ్యునల్‌ ఛైర్మన్‌ - సూదిని రామిరెడ్డి
గ్రామపంచాయతీ ట్రైబ్యునల్‌ సభ్యులుగా నగులూరి కృష్ణకుమార్‌, బూసా వేణుగోపాల్‌ను నియమించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA