Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

VIDHATHA 6 days ago

వీధి కుక్కల నియంత్రణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రమాదకర కుక్కలను సహించొద్దని, ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ : వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. బహిరంగ ప్రదేశాల్లోని వీధి కుక్కల తరలింపు ఆదేశాల ఉపసంసహరణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 2025 నవంబర్‌లో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల్లో మార్పులు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. వీధి శునకాలు ఇబ్బడిముబ్బడిగా పెరగడం ప్రమాదకరమని వ్యాఖ్యానించింది. అవి ప్రజలపై చేసిన దాడులను విస్మరించలేమని స్పష్టం చేసింది. వీధి కుక్కల సమస్యపై ప్రభుత్వాలు ప్రేక్షకపాత్ర పోషించరాదని హెచ్చరించింది. కుక్కల నియంత్రణపై ప్రభుత్వాల తీరును తప్పుబట్టింది. దేశంలో పెరుగుతున్న కుక్క కాట్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

వీధుల్లో కుక్కలు కనపడటానికి వీల్లేదని ఆదేశించింది. ప్రమాదకరమైన కుక్కలను ఎంతమాత్రం సహించవద్దని, పిచ్చి కుక్కలను యుథనేషియా ఇచ్చి చంపేయాలన్న సుప్రీంకోర్టు పేర్కొంది. విద్యాసంస్థలు, ఆస్పత్రులు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల ప్రాంగణాల నుంచి కుక్కలను తరలించాలని ఆదేశించింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల అమలును పర్యవేక్షించాలని రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించింది. ఆదేశాలు అమలు చేయకపోతే అధికారులు కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA