Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయ్ ని సీఎం కాకుండా నేను అడ్డుపడలేదు: రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు

విజయ్ ని సీఎం కాకుండా నేను అడ్డుపడలేదు: రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు

VIDHATHA 1 week ago

విజయ్ ని సీఎం కాకుండా అడ్డుకోవాలని నేను చూడలేదు అని, అలాంటి నీచ రాజకీయాలు నేను చేయనని రజనీకాంత్ స్పష్టం చేశారు. రాజకీయాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నారు.

తమిళనాడు ఎన్నికల ఫలితాల అనంతరం డీఎంకే చీఫ్‌ ఎంకే స్టాలిన్‌ను కలవడంపై చెలరేగిన విమర్శలపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు.నేను స్టాలిన్ ని కలవడంలో ఎలాంటి దురుద్దేశం లేదు అన్నారు.

విధాత : తమిళనాడు ఎన్నికల ఫలితాల అనంతరం డీఎంకే చీఫ్‌ ఎంకే స్టాలిన్‌ను కలవడంపై చెలరేగిన విమర్శలపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు.నేను స్టాలిన్ ని కలవడంలో ఎలాంటి దురుద్దేశం లేదు అని, స్టాలిన్ నాకు మంచి స్నేహితుడు ఎన్నికలలో ఓడిపోయిన నైరాశ్యంలో ఉన్నప్పుడు తాను ఆయనను పరామర్శించేందుకే కలిశానని స్పష్టం చేశారు. తమ స్నేహం రాజకీయాలకు అతీతమైనదని, ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం బాధ కలిగించిందని ఓ మీడియా సమావేశంలో తెలిపారు. రజనీకాంత్ అనవసరంగా ఇతర విషయాల గురించి మాట్లాడే చవకబారు, నీచమైన వ్యక్తి కాదని స్పష్టం చేశారు.

విజయ్ ని సీఎం కాకుండా అడ్డుకోవాలని నేను చూడలేదు అని, అలాంటి నీచ రాజకీయాలు నేను చేయనని రజనీకాంత్ స్పష్టం చేశారు. రాజకీయాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నారు. కమలహాసన్ సీఎం అయితే అసూయపడతానని.. విజయ్ నాకు సమవుజ్జి అనుకోవడం లేదు అని పేర్కొన్నారు. విజయ్ కి నాకు 25 ఏళ్ల వ్యత్యాసం ఉంది అని గుర్తు చేశారు. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారని, అందుకే విజయ్ ని గెలిపించారు అన్నారు. అన్ని పార్టీల్లో నాకు అభిమానులు ఉంటారని, 2021 లో పార్టీ పెడితే కచ్చితంగా గెలిచేవాడినే అని రజనీకాంత్ పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA