Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విశ్వామిత్రి..మొసళ్ల ఆవాసం !

విశ్వామిత్రి..మొసళ్ల ఆవాసం !

VIDHATHA 1 week ago

కొన్ని నదులు, రిజర్వాయర్లు, సరస్సులు మొసళ్లకు అనువైన ఆవాసంగా కొనసాగుతుంటాయి. భారత్ లోనూ మొసళ్ల జనాభా భారీగా ఉన్న నదులు, రిజర్వాయర్లు చాలనే ఉన్నాయి.

వాటిలో ప్రత్యేకమైనది గుజరాత్‌లోని వడోదరలో ఉన్న విశ్వామిత్రి నది. దీనిని "భారతదేశపు మొసలి నది" అని కూడా పిలువడం ప్రసిద్ది.

తాజా వర్షాలు, వరదల నేపథ్యంలో విశ్వామిత్రి నదిలో తేలియాడుతున్న మొసళ్ల సమూహం సందర్శకులకు గగుర్పాటుతో పాటు అద్భుత దృశ్యంగా కనిపిస్తుంది. భారతదేశంలో మూడు జాతుల మొసళ్ళ మనుగడ సాగుతుండగా..ఈ నదిలో 500కు పైగా 'మగ్గర్' జాతి మొసళ్లు నివసిస్తున్నాయని అధికారుల అంచనా. ఇవి అంతరించిపోతున్న జాతులు కావడంతో చట్టపరంగా అత్యంత రక్షణను కలిగి ఉన్నాయి. గుజరాత్ ఎకాలజికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (GEER) ఫౌండేషన్ జరిపిన గణన ప్రకారం,విశ్వామిత్రి ప్రాంతంలో 500కు పైగా మొసళ్లు ఉన్నాయి. విశ్వామిత్రి నది పరిసరాలు, సమీప కాల్వలలో కలిసి మొత్తం 1,000 కు పైగా మొసళ్లు జీవిస్తున్నాయని అంచనా.

విశ్వామిత్రి నదిలో వందలాది మొసళ్లు జీవిస్తున్నప్పటికి ఇక్కడి మొసళ్లు ఇప్పటిదాక మనుషులపై దాడి చేసిన ఘటనలు నమోదు కాకపోవడం ఆశ్చర్యం కల్గించకమానదు. నది తీరంలో మనుషులతో మొసళ్లు సహజీవనం సాగిస్తున్నట్లుగా ఇక్కడ వాటి ప్రవర్తన ఉంటుందంటున్నారు.

అరేబియా సముద్ర తీరంలో ఉన్న గుజరాత్ రాష్ట్రం దేశంలోనే అతిపెద్ద మొసళ్ల ఆవాసాలలో ఒకటిగా కొననసాగుతుంది. గుజరాత్‌లోని చాలా మొసళ్లు నర్మదా,యు విశ్వమిత్రి నదులలో నివసిస్తాయి. మహి, దాధర్ వంటి కొన్ని నదులలో కూడా భారీ సంఖ్యలో మొసళ్లు మనుగడ సాగిస్తున్నాయి. ఆయా నదులు,వాటి ఉపనదులు రాష్ట్రమంతటా విస్తరించి ఉండగా..ఈ మూడు నదులు ప్రత్యేకంగా వడోదర నగరం గుండా ప్రవహిస్తాయి. మొసళ్ల బెడద విషయంలో వడోదర అత్యంత ప్రభావిత ప్రాంతం. వర్షాకాలంలో, ఈ నదులు పొంగిపొర్లిన సందర్భంలో తరచుగా ఈ మొసళ్లు నేరుగా మనుషుల ఇళ్ల ముంగిటకే వస్తాయి. 2019 వర్షాకాలంలో, ఆకస్మిక వరదల కారణంగా వడోదరలో వీధుల్లోకి వచ్చిన దాదాపు 80 మగ్గర్ మొసళ్లను రక్షించబడటం స్థానికులను భయాందోళనలనకు గురి చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA