Dailyhunt
యుద్దం ఎఫెక్ట్.. నావికులను కోల్పోయిన ఏకైక దేశం భారత్ !

యుద్దం ఎఫెక్ట్.. నావికులను కోల్పోయిన ఏకైక దేశం భారత్ !

VIDHATHA 3 weeks ago

శ్చిమాసియా యుద్దంలో భాగంగా హర్మూజ్ జలసంధి మార్గంలో జరిగిన సైనిక ఘర్షణల్లో నావికులను కోల్పోయిన ఏకైక దేశం తమదేనని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ వెల్లడించారు.

హర్మూజ్ వద్ద వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల్లో విదేశీ జెండాలతో ఉన్న నౌకల్లోని ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు.

విధాత: పశ్చిమాసియా యుద్దంలో భాగంగా హర్మూజ్ జలసంధి మార్గంలో జరిగిన సైనిక ఘర్షణల్లో నావికులను కోల్పోయిన ఏకైక దేశం తమదేనని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ వెల్లడించారు. ప్రపంచ ఇంధన రవాణకు కీలకమైన హర్మూజ్ జలసంధిని తెరిపించేందుకు బ్రిటన్ నేతృత్వంలో 60కి పైగా దేశాలు సమావేశమయ్యాయి. ఈ కీలక భేటీకి భారత్ తరపున విక్రమ్ మిస్త్రీ వర్చువల్ గా హాజరై మాట్లాడారు.

హర్మూజ్ వద్ద వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల్లో విదేశీ జెండాలతో ఉన్న నౌకల్లోని ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ఇంధన సరఫరాలో ఆటంకాలతో భారత్‌పై పడుతోన్న ప్రభావం గురించి వివరించారు. దౌత్యమార్గాల ద్వారానే యుద్దం..ఇంధన సంక్షోభం నుంచి బయటపడతామని సూచించారు. అంతర్జాతీయ జలమార్గాలను స్వేచ్చాయుతంగా, సురక్షితంగా కొనసాగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

హార్మూజ్ జల సంధిని తెరిపించడం కోసం బ్రిటన్, ఫ్రాన్స్, చైనా వంటి దేశాలు చొరవ తీసుకుని అమెరికా, ఇరాన్ లతో రాజకీయ, దౌత్యపరమైన సంప్రదింపులు చేస్తున్నాయి. హర్మూజ్ జలసంధిని తెరిపించే దిశగా దౌత్య, రాజకీయ పరిష్కారం మార్గాలు ఫలించక పోతే సైనిక చర్య అంశం కూడా కొన్ని దేశాల పరిశీలనలో ఉందని బ్రిటన్ విదేశాంగ మంత్రి కూపర్ వెల్లడించారు.

మరోవైపు యుద్ధంతో ఇరాన్ దేశానికి ఏమీ మిగల్లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్‌లో విధ్వంసం ఇంకా మొదలవలేదని ట్రూత్‌ సోషల్‌లో వ్యాఖ్యానించారు. ఇరాన్‌ తన ఉనికిని కోల్పోకముందే ఒక ఒప్పందానికి రావాలని హెచ్చరించారు.

అయితే తమ వద్ద రహస్య ప్రాంతాల్లో ఆయుధాలు ఉన్నాయని అమెరికా భూతల దాడికి దిగితే తీవ్ర దెబ్బ కొడతామని ఇరాన్ హెచ్చరించింది. ఇప్పటికే లెబనాన్ తో భూతల పోరాటం తీవ్రతరం చేయడంతో పాటు ఇజ్రాయిల్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తుండటంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి.

Telangana Group 1| గ్రూప్ -1 నియామకాలపై సుప్రీం తీర్పు స్వాగతనీయం : సీఎం రేవంత్ రెడ్డి
Traffic Restrictions | ఎల్లుండి ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA