Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యూపీలో గాలి వాన బీభత్సవానికి 113 మంది బలి!

యూపీలో గాలి వాన బీభత్సవానికి 113 మంది బలి!

VIDHATHA 1 week ago

త్తరప్రదేశ్‌లో గాలివానలు, పిడుగుపాట్ల బీభత్సానికి 113 మంది మృతి చెందారు. 26 జిల్లాల్లో భారీ నష్టం సంభవించగా, బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని సీఎం యోగి ఆదేశించారు.

ఉత్తరప్రదేశ్‌లో గాలివానల బీభత్సానికి ఏకంగా 113మంది బలైపోయారు. భారీవృక్షాలు పడిపోవడం, ఇళ్లు నేలకూలడం, పిడుగుపాట్లు వంటి వాటితో 26 జిల్లాల పరిధిలో కనీసం 113 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఒక్కరోజే 89 మంది మరణించారు. అనేకమంది గాయపడ్డారు. ప్రయాగ్‌రాజ్‌ జిల్లాలో అత్యధికంగా 21 మంది మృతి చెందారు. భదోహిలో 16 మంది మరణించారు. గాలివాన బీభత్సానికి ఆయా ప్రాంతాల్లో భారీ ఆస్తినష్టం సంభవించింది. పెద్దఎత్తున పశువులు ప్రాణాలు కోల్పోయాయి. బాధిత కుటుంబాలకు 24 గంటల్లోగా సహాయం అందేలా చూడాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశించారు.

బరేలీ జిల్లాలో ఈదురుగాలుల ఉదృతికి రేకుల షెడ్డు ఎగిరిపోయేలా ఉండటంతో వాటిని తాడుతో కట్టాలని ప్రయత్నించిన నన్హే మియా (50) అనే ఈ-రిక్షా డ్రైవరు ఆ రేకులతోపాటు దాదాపు 50 అడుగుల ఎత్తుకు అమాంతం ఎగిరిపోయి 300 మీటర్ల దూరంలోని ఓ పొలంలో పడిపోయారు. దీంతో అతను తీవ్ర గాయాలపాలయ్యాడు . ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మొదట ఈ ఘటన ఏఐ సృష్టిగా భావించినా..అది నిజమైదేనని తేలడంతో వైరల్ గా అవుతోంది.

యూపీలో సంభవించిన గాలివానలతో నెలకొన్న ప్రాణనష్టంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీలకు సంతాప సందేశం పంపించారు.

Divorce | నాలుగేళ్ల వైవాహిక బంధానికి ముగింపు.. విడాకులపై క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ ముద్దుగుమ్మ
మోదీ షాక్…పెట్రోల్..డీజిల్, సీఎన్జీ ధరల పెంపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA