పాలిటిక్స్
53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!

ఏపీ రాష్ట్రంలోని వివిధ జైళ్లలో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న 53 మంది మహిళా ఖైదీలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఈ ఏడాది స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా మొత్తం 53 మంది మహిళా ఖైదీల్ని ముందస్తుగా విడుదల చేయనున్నారు.
ఈమేరకు రాజమండ్రి మహిళా జైలు నుంచి 19 మంది, కడప నుంచి 27, నెలూరు నుంచి 5, విశాఖ పట్నం నుంచి ఇద్దరు మహిళా ఖైదీలు జైలు నుంచి ముందుగానే విడుదల కానున్నారు. ఈమేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా వీరందరికి ప్రభుత్వం కొన్ని షరతులను విధించింది. మహిళా ఖైదీలను రూ. 50 వేల పూచికత్తుపై విడుదల చేయనున్నారు.
విడుదలైన వారు శిక్షాకాలం ముగిసేవరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకం చేయవలసి ఉంటుంది. బయటకు వచ్చిన వారు ఏదైనా నేరాలకు పాల్పడితే ముందస్తు విడుదలను రద్దు చేసి మళ్ళీ జైలుకు పంపుతామని ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది.
related stories
-
తెలంగాణ తాజావార్తలు మోదీ ఫొటో లేదని.. కేసీఆర్ ఫ్లెక్సీ చించివేత
-
జాతీయం కిసాన్ పరేడ్ అనుమతిపై మీదే అధికారం
-
హైదరాబాద్ అక్రమ నిర్మాణాల తొలగింపు