పాలిటిక్స్
బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు!

గ్రేటర్ ఎన్నికల దృష్ట్యా అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలను విడుదల చేస్తున్నాయి. కొంచెం ఆలస్యం అయినా బీజేపీ కూడా తాజాగా తమ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కలిసి ఈ మేనిఫెస్టోను విడుదల చేసారు. హైదరాబాద్ ప్రజల అభివృద్ధి, ఆత్మ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టోను విడుదల చేసినట్టుగా పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీ న్నికల్లో తమను గెలిపిస్తే మహిళలకు బస్సులు, మెట్రోల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. కరోనా పరీక్షలు, వాక్సిన్లను నగర ప్రజలకు చితంగా అందిస్తామన్నారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేసి ప్రజలపై రూ. 15 వేల కోట్ల భారం పడకుండా చూస్తామన్నారు. గ్రేటర్ పరిధిలో లక్ష మందికి ఇళ్ల పంపిణీ చేస్తామన్నారు.
వరద బాధితులకు రూ. 25 వేల సాయం అందిస్తామన్నారు. ఓల్డ్ సిటీ లో ప్రతి డివిజన్ కు రూ.4 కోట్లకు తగ్గకుండా నిధులు అందిస్తామన్నారు. జీహెచ్ ఎంసీ పరిధిలో 28వేల కొత్త నియామకాలు చేపడతామన్నారు. హైదరాబాద్ నలువైపులా డంపింగ్ యార్డులు నిర్మిస్తామన్నారు.
సెలూన్లకు ఏటా రూ.15వేల వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు. హైదరాబాద్ లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగు చేస్తాం. పక్కా ప్రణాళికతో అక్రమ నిర్మాణాల తొలగింపు చేపడతాము. ప్రతి డివిజన్ కు నాలుగు స్మశాన వాటికలు నిర్మిస్తాం. కార్మికులకు రూ.5లక్షల ఆరోగ్య బీమా
ఆటో డ్రైవర్లకు ఏటా రూ.7వేల సాయం అందజేస్తాం.
తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిన రోజున వేడుక జరపడం లేదు బీజేపీ గెలిస్తే సెప్టెంబర్ 17 అధికారిక విమోచన దినోత్సవంగా జరుపుతాం. ప్రతీ డివిజన్ లో గ్రీవెన్స్ సెల్, హెల్త్ అడ్వైజరీ సెల్ ఏర్పాటు చేస్తామన్నారు.
related stories
-
తెలంగాణ తాజావార్తలు చెరువుల పరిరక్షణ బాధ్యత అందరిది
-
చిత్రజ్యోతి సేవ్ థియేటర్స్.. ముఖ్యమంత్రిని ఉద్దేశించి నినాదాలు
-
హైదరాబాద్ మేయర్‌ను కలిసిన యూఎస్ కాన్సులేట్ జనరల్