Thursday, 26 Nov, 12.29 pm VIGIL MEDIA

పాలిటిక్స్‌
ఏబీ వెంకటేశ్వర్ రావుకు సుప్రీంలో షాక్..!

గత ప్రభుత్వాల హయాంలో ఆంధ్రప్రదేశ్ ఇంటిలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఐఏఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర్ రావు విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఏపీ ప్రభుత్వం అతనిపై సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. దీనిపై ఏబీవీ హై కోర్టును ఆశ్రయించగా .. స్సపెన్షన్ ను ఎత్తివేస్తూ హై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హై కోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది.

తాజాగా ఈ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీం ఏబీ వెంకటేశ్వర్ రావు కు షాకిచ్చింది. ఏబీవీ సప్సెన్షన్ ను నిలిపివేస్తూ హై కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు నిలిపివేసింది. సస్పెన్షన్ ను ఎత్తివేస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని ఏపీ ప్రభుత్వం వాదనలు వినిపించింది. సుప్రీం తాజా ఉత్తర్వులతో ప్రస్తుతం ఏబీవీపై సస్పెన్షన్ కొనసాగనుంది. దీంతో ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Vigil Media Telugu
Top