పాలిటిక్స్
ఎందుకంత ఆగం.. బండి సంజయ్ 'సర్జికల్ స్ట్రయిక్' వ్యాఖ్యలపై విజయశాంతి

జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహిస్తామంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా మాజీ ఎంపీ విజయశాంతి మండిపడ్డారు. సంజయ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎందుకంత ఆగమాగం అవుతుందని ఆమె ప్రశ్నించారు.
'సర్జికల్ స్ట్రయిక్ అన్న అంశానికి సంబంధించి హైదరాబాద్ పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తానీల గురించి టీఆరెస్, ఎంఐఎం ఇంత ఆగమాగం ఎందుకు అవుతున్నాయి? టీఆరెస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఇంటింటి సర్వే చేసిందని. పాతబస్తీలో ఆ విధంగా ఎవరూ లేరని. సీఎం గారు తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్రానికి అధికారపూర్వక నివేదిక ఇవ్వచ్చు కదా? లేకుంటే ఎవరినైనా దాచిపెట్టడం వల్లనే టీఆరెస్ భయాందోళనలకు గురవుతున్నదని ప్రజలు అభిప్రాయపడే అవకాశముంది.' అని విజయశాంతి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
కాగా బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. పచ్చగా ఉన్న హైదరాబాద్ ను పాకిస్థానీ ఉగ్ర స్థావరాలతో పోలుస్తారా? అంటూ ఫైర్ అయ్యారు. సీట్ల కోసం, ఓట్ల కోసం ఆయన మతిస్థిమితం కోల్పోయి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.
related stories
-
తెలంగాణ తాజావార్తలు జగదీశ్‌రెడ్డిని జగ్గారెడ్డి విమర్శించడం హాస్యాస్పదం: లింగయ్య యాదవ్
-
హోమ్ నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్!
-
ఆంధ్రప్రదేశ్ త్వరలోనే తెలంగాణలో నిరుద్యోగ భృతి