Wednesday, 27 Jan, 4.48 pm VIGIL MEDIA

క్రైమ్‌
మదనపల్లె జంట హత్యల కేసులో కొత్త ట్విస్ట్.. అసలు సూత్రధారి పెద్దమ్మాయేనా?

మదనపల్లె జంట హత్యల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పునర్జన్మల పై అతి విశ్వాసమే ఈ హత్య లకు కారణంగా తెలుస్తుంది. అయితే ఈ కేసులో కూతుళ్లను హత్య చేసిన పురుషోత్తం నాయుడు, పద్మజాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిప్పుడు మదనపల్లె సబ్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు.

అయితే ఈ హత్యలకు ప్రధాన కారణం వీరి పెద్ద కుమార్తె అలెఖ్యేననే అనుమానాలు వ్యక్తమవుతన్నాయి. చెల్లి దివ్యను తల్లిదండ్రులతో కలిసి హత్య చేసిన అలేఖ్య ఆ తర్వాత తనను కూడా చంపాలని తల్లిదండ్రులను కోరింది. తాను చెల్లిని తిరిగి బతికించి తెస్తానని నమ్మించింది.

చిన్న కూతురు దివ్య ఓ రోజు వాకింగ్ వెళ్లి వచ్చిన తర్వాత నుంచి మానసికంగా భయాందోళను గురవుతుందని తల్లిదండ్రులు పోలీసులకు వివరించారు. అయితే ఆ నాటి నుంచి దివ్య తాను చనిపోతానని భయంతో ఉంది. ఆమె భయాన్ని పోగొట్టడానికి బదులుగా అక్క అలేఖ్య అవును నువ్వు నిజంగానే చనిపోతావని చెప్పింది. ఆ తర్వాత భయంతో దివ్య కేకలు వేయడంతో ముగ్గురు కలిసి ఆమె తలపై డంబుల్ తో కొట్టి చంపారు.

ఆ తర్వాత మూడు గంటల తర్వాత అలేఖ్య పూజ గదిలో పూజలు జరిపి తనను కూడా చెల్లి లాగానే చంపాలని తల్లిదండ్రులను కోరిందని పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అయితే అలేఖ్య మానసిక స్థితిపై కూడా అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. గతంలో ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కపై కూడా అలేఖ్య ఇలాంటి ప్రయోగాలే చేసినట్టుగా సమాచారం అందుతుంది. పోలీసుల దర్యాప్తులో మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Vigil Media Telugu
Top