Posts
కరోనావైరస్: భారత్‌లో ఇస్తున్న కోవిడ్ వ్యాక్సీన్లు ఏంటి... అవి ఎలా పని చేస్తాయి?

ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైన వారం రోజులలోనే లక్షలాది డోసుల కోవిడ్ వ్యాక్సీన్‌ను భారత్ పొరుగు దేశాలకు ఉచితంగా పంపడం మొదలు పెట్టింది. దీన్ని టీకా రాయబారం ( Vaccine Diplomacy ) అని కూడా అంటున్నారు.
యూకేకు చెందిన ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకాకు స్థానిక పేరైన కోవిషీల్డ్‌కు, భారత్ బయోటెక్ కంపెనీ తయారీ వ్యాక్సీన్ కోవాగ్జిన్‌కు భారత డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఆమోదం తెలిపింది.
ఇప్పటికే భారత్ ప్రపంచ వ్యాక్సీన్ హౌస్‌గా పేరు తెచ్చుకుంది. ప్రపంచ వ్యాప్తంగా తయారయ్యే వ్యాక్సీన్లలో 60% భారత్‌లోనే తయారవుతున్నాయి. అర డజనుకు పైగా భారీ తయారీ సంస్థలు ఈ పనిలో భాగం పంచుకుంటున్నాయి.
భారత్‌లో తయారవుతున్న వ్యాక్సీన్ల ప్రత్యేకతలేంటి?
కోవిషీల్డ్ ఎలా పని చేస్తుంది ?
ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్‌ను 'కోవిషీల్డ్' అనే పేరుతో పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తోంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సీన్ తయారీ కేంద్రం. నెల రోజుల్లో 5 కోట్ల డోసుల వ్యాక్సీన్‌ను తయారు చేయగలమని ఆ సంస్థ చెబుతోంది.
చింపాంజీలలో బలహీనపడిన సాధారణ జలుబు వైరస్ (ఎడినోవైరస్) నుంచి ఈ వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేశారు. దీనివల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉండవని చెబుతున్నారు.
ఈ వ్యాక్సీన్ శరీరంలోకి వెళ్లగానే అక్కడున్న వ్యాధి నిరోధక శక్తిని కదిలించి యాంటీబాడీలు ఉత్పత్తి చేసేలా చేస్తుంది. దీంతో రోగ నిరోధక వ్యవస్థ కరోనా వైరస్‌పై పోరాటం ప్రారంభిస్తుంది.
12 వారాల వ్యవధిలో రెండు డోసులుగా ఈ వ్యాక్సీన్‌ను ఇస్తారు. 2 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 8 డిగ్రీల సెంటీగ్రేడ్ల మధ్య ఇళ్లలో వాడే సాధారణ రిఫ్రిజిరేటర్లలో కూడా దీన్ని నిల్వ చేయవచ్చు. దీనిని ఆసుపత్రుల వరకు చేర్చడం కూడా చాలా సులభం. ఇతర వ్యాక్సీన్లతో పోలిస్తే దీన్ని పంపిణీ చాలా సులభమని చెప్పవచ్చు.
ఫైజర్-బయోఎన్‌టెక్ తయారీ వ్యాక్సీన్‌ను ప్రస్తుతం అనేక దేశాలలో వాడుతున్నారు. అయితే దీన్ని -70 డిగ్రీ సెంటీగ్రేడ్ల వద్ద భద్రపరచాలి. దీనిని ఎక్కువసార్లు కదిలిండం, రవాణా చేయడం కూడా మంచిది కాదు.
భారత్ లాంటి దేశాలలో ఇది చాలా కష్టమైన పని. పైగా ఇక్కడ ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల వరకు నమోదవుతుంటాయి.
related stories
-
జాతీయం-అంతర్జాతీయం జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా వ్యాక్సిన్ సురక్షితం: అమెరికా
-
జాతీయం-అంతర్జాతీయం ఈ రాష్ట్రాలకు వెళ్ళాలంటే నెగెటివ్ కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ తప్పనిసరి
-
ఎన్.ఆర్.ఐ 6.5కోట్ల మంది అమెరికన్లకు కరోనా వ్యాక్సిన్: యూఎస్ సీడీసీ