Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
04-05-2026 సోమవారం ఫలితాలు - బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి...

04-05-2026 సోమవారం ఫలితాలు - బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి...

Weekly Horoscope

మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం

కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి.

వ్యతిరేకులతో జాగ్రత్త. ఖర్చులు విపరీతం. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఆప్తులను విందుకు ఆహ్వానిస్తారు. అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు.

వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు

రావలసిన ధనం అందుతుంది. రుణ సమస్య పరిష్మారమవుతుంది. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు అధికం. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. పనులు ముందుకు సాగవు. దైవకార్యంలో పాల్గొంటారు.

మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఆప్తులకు సాయం చేస్తారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. కీలక చర్చల్లో పాల్గొంటారు.

కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రణాళికాబద్ధంగా పనులు సిద్ధం చేసుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. చెల్లింపుల్లో జాగ్రత్త. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి.

సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఓర్పుతో యత్నాలు సాగించండి. అపజయాలకు కుంగిపోవద్దు. మనోధైర్యంతో అడుగు ముందుకేయండి. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య అకారణ కలహం. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.

కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు

కొంతమేరకు అనుకూలమే. పరిస్థితులు చక్కబడతాయి. వ్మూహాత్మకంగా అడుగులేస్తారు. మీ కృషిని కుటుంబీకులు ప్రోత్సహిస్తారు. ఖర్చులు అధికం. అవసరాలకు ధనం అందుతుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు.

తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఖర్చులు సామాన్యం. ప్రముఖులకు సన్నిహితులవుతారు. వస్త్రప్రాప్తి, కుటుంబ సౌఖ్యం ఉన్నాయి. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. వాహనం ఇతరులకివ్వవద్దు.

వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు

అన్ని విధాలా అనుకూలమే. ప్రముఖులను ఆకట్టుకుంటారు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. చేపట్టిన పనుల్లో శ్రమ, చికాకులు అధికం. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది.

ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం

కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు చేరువవుతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు వేగవంతమవుతాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. శుభకార్యానికి హాజరవుతారు.

మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు

మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. ఆప్తులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. ఖర్చులు విపరీతం. పిల్లల కదలికలపై దృష్టి సారించండి. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు.

కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు

పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. మీ సమర్ధతపై నమ్మకం పెంచుకోండి. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు. వేడుకకు హాజరుకాలేరు.

మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి

శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. మీదైన రంగంలో రాణిస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. దైవకార్యాలకు వ్యయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. ప్రలోభాలకు లొంగవద్దు. మీ చిత్తశుద్ధిని కొంతమంది శంకిస్తారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu