Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
05-05-2026 మంగళవారం ఫలితాలు - గిట్టని వ్యక్తులతో జాగ్రత్త

05-05-2026 మంగళవారం ఫలితాలు - గిట్టని వ్యక్తులతో జాగ్రత్త

Astrology

మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం

దాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. సంప్రదింపులతో తీరిక ఉండదు.

మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. పిల్లల చదువులపై దృష్టి సారిస్తారు. వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి. ప్రయాణం తలపెడతారు.

వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు

రుణ విముక్తులవుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఖర్చులు అధికం. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు.

మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఉన్నతి కొందరికి అసూయ కలిగిస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. నిలిపివేసిన పనులు పునఃప్రారంభమవుతాయి. వ్యవహారాల్లో జాగ్రత్త. అనుభవజ్ఞుల సలహా పాటించండి.

కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. ఆప్తులతో సంభాషిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. నోటీసులు అందుకుంటారు.

సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

కార్యసాధనకు మరింత శ్రమించాలి. శ్రమించినా ఫలితం ఉండదు. అందరితోను మితంగా సంభాషించండి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త, శుభకార్యానికి హాజరవుతారు.

కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు

రుణ ఒత్తిడి ఆందోళన కలిగిస్తుంది. అన్యమనస్కంగా గడుపుతారు. ఖర్చులు అధికం. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై ప్రభావం చూపుతాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. దంపతుల మధ్య సఖ్యత లోపం, పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు.

తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

వ్యవహార పరిజ్ఞానంతో నెట్టుకొస్తారు. ఖర్చులు తగ్గించుకుంటారు. ప్రముఖులకు సన్నిహితులవుతారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. గిట్టని వ్యక్తులతో జాగ్రత్త. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. అప్రియయమైన వార్త వింటారు. పనులు ముందుకు సాగవు.

వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు

ముఖ్యమైన పనులతో హడావుడిగా ఉంటారు. శ్రమాధిక్యత, అకాలభోజనం. ఆదాయానికి తగ్గట్టగా ఖర్చులుంటాయి. పెట్టుబడుల విషయంలో పునరాలోచించండి. తొందరపాటు నిర్ణయాలు తగదు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.

ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం

అవిశ్రాంతంగా శ్రమిస్తారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యవహారదక్షతతో నెట్టుకొస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త, పనులు చురుకుగా సాగుతాయి.

మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు

లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. కష్టించినా ఫలితం అంతంత మాత్రమే. సమర్ధతకు గుర్తింపు ఉండదు. యత్నాలు కొనసాగించండి. రోజువారీ ఖర్చులుంటాయి. వ్యవహారాలతో తలమునకలవుతారు. ఆత్మీయుల రాక ఉత్సాహం కలిగిస్తుంది. నిందుకు హాజరవుతారు.

కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు

నేడు అనుకూలదాయకం. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. ఖర్చులు విపరీతం. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు.

మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి

సంకల్పసిద్ధికి ఓర్పు ప్రధానం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. విమర్శలు పట్టించుకోవద్దు. స్థిరాస్తి ధనం అందుతుంది. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. అనవసర జోక్యం తగదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu