Dailyhunt
08-04-2026 బుధవారం ఫలితాలు- మాటతీరు అదుపులో ఉంచుకోండి

08-04-2026 బుధవారం ఫలితాలు- మాటతీరు అదుపులో ఉంచుకోండి

Daily Horoscope

మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం

చితూచి అడుగేయాల్సిన సమయం. అనవసర జోక్యం తగదు. వివాదాల జోలికి పోవద్దు, అందరితో మితంగా సంభాషించండి.

రోజువారీ ఖర్చులే ఉంటాయి. పాతమిత్రులను కలుసుకుంటారు. ఊహించని సంఘటన ఎదురవుతుంది. ప్రముఖులను సంప్రదిస్తారు.

వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు

పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడరాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. పసులు సానుకూలమవుతాయి. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. నోటీసులు అందుకుంటారు. కీలక చర్చల్లో పాల్గొంటారు.

మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

లావాదేవీలు ముగుస్తాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. నిర్దిష్ట ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. మీ శ్రమ ఫలిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త

కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఒప్పందాలు చేసుకుంటారు. వాహనసౌఖ్యం ఉంది. ఖర్చులు అధికం. ప్రయోజనకరం కొత్త యత్నాలు చేపడతారు. అవకాశాలను తక్షణం అంది పుచ్చుకోండి. చేపట్టిన పనులు సాగవు. అపరిచితులతో మితంగా సంభాషించండి.

సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

పరిస్థితులు చక్కబడతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయం తగదు. విదేశాల్లోని ఆత్మీయులతో సంభాషిస్తారు. గృహమార్పు అనివార్యం.

కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు

కీలక వ్యవహారంలో జాగ్రత్త. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. భేషజాలకు పోవద్దు. రుణ ఒత్తిడి ఆందోళన కలిగిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. ఓర్పుతో శ్రమించిన గాని పనులు రావు. ప్రియమైన వార్త వింటారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి.

తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

సంప్రదింపులు వాయిదా పడతాయి. ఆలోచనలతో సతమతమవుతారు. సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. కొత్తయత్నాలు చేపడతారు. అవకాశాలు చేజారిపోతాయి. చేపట్టిన పనులు సాగవు. సోదరులతో విభేదిస్తారు.

వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు

అనుకున్న కార్యం విజయవంతమవుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు విపరీతం. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఏకపక్ష నిర్ణయం తగదు.

ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం

ముందస్తు ప్రణాళికలతో యత్నాలు చేపడతారు. అవకాశం కలిసివస్తుంది. పనుల సానుకూలతకు నిర్విరామంగా శ్రమిస్తారు. మాటతీరు అదుపులో ఉంచుకోండి. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. రసీదులు, పత్రాలు జాగ్రత్త. కీలక సమావేశంలో పాల్గొంటారు.

మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు

సాహసించి నిర్ణయాలు తీసుకుంటారు. మీ కష్టం వృధా కాదు. మొండిబాకీలు వసూలవుతాయి. ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. సాయం ఆశించవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. ఇతరులతో మితంగా సంభాషించండి.

కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు

కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఏకాగ్రతతో కార్యక్రమాలు కొనసాగించండి. అవకాశాలను వదులుకోవద్దు. పట్టుదలతో శ్రమించిన గాని పనులు గావు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. అనవసర జోక్యం తగదు. గిట్టని వ్యక్తులు మీ వ్యాఖ్యలను వక్రీకరిస్తారు.

మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి

ఆర్థికస్థితి నిరాశాజనకం. దుబారా ఖర్చులు అధికం. ఆలోచనలతో సతమతమవుతారు. మనోధైర్యంతో మెలగండి. సన్నిహితుల హితవు మీపై పనిచేస్తుంది, మానసికంగా స్థిమితపడతారు. పనులు సానుకూలమవుతాయి. విందులు, వేడుకల్లో పాల్గొంటారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu