Daily Astrology
మేషం : అశ్వని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం.మీ ప్రయత్నాలకు తగిన ఫలితం లభించి ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. ఆర్థికంగా కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది.
వృషభం : కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు.
కుటుంబంలో శుభకార్యానికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. వ్యాపారంలో లాభాలు పెరగడానికి కొత్త అవకాశాలు కనిపిస్తాయి.
మిథునం : మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు.
ఉద్యోగంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. సమయసాలన పాటిస్తే పనులను ఒత్తిడి లేకుండా పూర్తి చేయగలుగుతారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆర్థికంగా అనుకూలమైన పరిణామాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు పరస్పర అవగాహనకు ప్రాధాన్యం ఇవ్వాలి.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం.
ఉన్నతాధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారంలో కొత్త కస్టమర్లను ఆకర్షించే అవకాశం ఉంది.
కన్య : ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు.
పనుల్లో పురోగతి ఉన్నప్పటికీ శారీరక అలసటకు అవకాశం ఉంటుంది. తగిన విశ్రాంతి తీసుకుంటూ రోజు వారి కార్యక్రమాలను నిర్వహించాలి.
తుల : చిత్త 3,4 పాదాలు స్వాతి విశాఖ 1,2,3 పాదాలు.
కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి అవి భవిష్యత్ కార్యాచరణకు ఉపయోగపడతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక లేదా వృత్తిపరమైన సహకారం లభిస్తుంది.
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనురాధా, జ్యేష్ట 1,2,3,4 పాదాలు.
ధన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల మాటలకు ప్రభావితమై నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. స్వయంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
ధనుస్సు : మూల, పూర్వాషాఢ 1,2,3,4 పాదాలు, ఉత్తరషాడ 1వ పాదం.
ఉద్యోగంలో మార్పులకు సంబంధించిన అవకాశం రావచ్చు. ప్రయాణం ద్వారా కొత్త అనుభవాలు ప్రయోజనకరమైన పరిచయాలు లభిస్తాయి.
మకరం : ఉత్తరషాడ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు.
వ్యాపారంలో మంచి లాభం పొందే అవకాశం ఉంది. కుటుంబంలో ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమై ఉపశమనం కలుగుతుంది.
కుంభం : ధనిష్ట 3,4 పాదాలు, శతభిషం, పూర్వభాద్ర 1,2,3 పాదాలు.
మీ ఆలోచనలకు ఇతరుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. కొత్త పనులు ప్రారంభించే ముందు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలి.
మీనం : పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి.
కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో ఎదురైన చిన్న సమస్యను ఓర్పుతో పరిష్కరించగలుగుతారు.

