Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
10-09-2026 గురువారం మీ రాశి ఫలితాలు.. పనిభారం పెరుగుతుంది

10-09-2026 గురువారం మీ రాశి ఫలితాలు.. పనిభారం పెరుగుతుంది

Daily Astrology

మేషం : అశ్వని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం.

ఉద్యోగంలో కీలకమైన పనిని పూర్తి చేసి మంచి పేరు పొందుతారు. ఆర్థికంగా లాభం వచ్చినా పొదుపు చేయడంపై దృష్టి పెట్టడం మంచిది.

వృషభం : కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు.

వ్యాపారంలో అనుకూలమైన చర్చలు జరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి చేసే ప్రయాణం లేదా కార్యక్రమం ఆనందాన్ని కలిగిస్తుంది.

మిథునం : మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు.

కొత్త బాధ్యతలు రావడంతో మీ పనిభారం పెరుగుతుంది. క్రమబద్ధమైన ప్రణాళికతో వ్యవహరిస్తే అన్ని పనులను సమర్థంగా పూర్తి చేస్తారు.

కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

కుబుంబానికి సంబంధించిన ఒక విషయం అనుకూలంగా పరిష్కారమవుతుంది. ప్రయాణాల్లో సమయపాలన పాటించడం ద్వారా ఇబ్బందులను తగ్గించవచ్చు.

సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం.

అధికారులు సహాకారంతో ముఖ్యమైన పని ముందుకు సాగుతుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే ముందు వారి పూర్తి వివరాలను పరిశీలించాలి.

కన్య : ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు.

ఆర్థికంగా స్థిరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం మంచిది.

తుల : చిత్త 3,4 పాదాలు స్వాతి విశాఖ 1,2,3 పాదాలు.

వృత్తిలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో మీ ఆలోచనలను పంచుకోవడం ద్వారా వారి మద్దతు పొందుతారు.

వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనురాధా, జ్యేష్ట 1,2,3,4 పాదాలు.

పనులు అనుకున్న దాని కంటే ఆలస్యంగా పూర్తవుతాయి. ఓర్పుతో వ్యవసారిస్తే సమస్యలు క్రమంగా పరిష్కారమవుతాయి.

ధనుస్సు : మూల, పూర్వాషాఢ 1,2,3,4 పాదాలు, ఉత్తరషాడ 1వ పాదం.

వృత్తిపరమైన ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది. కొత్త పరిచయం భవిష్యత్‌లో ముఖ్యమైన అవకాశానికి కారణమవుతుంది.

మకరం : ఉత్తరషాడ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు.

ఆర్థిక సమస్యలు తీరి కొంత ఉపశమనం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి.

కుంభం : ధనిష్ట 3,4 పాదాలు, శతభిషం, పూర్వభాద్ర 1,2,3 పాదాలు.

ఉద్యోగంలో మీ కృషికి గుర్తింపు లభిస్తుంది. స్నేహితుల సహకారంతో కొత్త పని ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది.

మీనం : పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి.

శుభవార్తలు అందుతాయి. కుటుంబంతో గడిపే సమయం మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu