Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
13-09-2026 నుంచి 19-09-2026 వరకు వార ఫలితాలు.. ఏ రాశికి లాభం..

13-09-2026 నుంచి 19-09-2026 వరకు వార ఫలితాలు.. ఏ రాశికి లాభం..

Weekly Horoscopes

మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం.

కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు.

మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. కొత్త యత్నాలు చేపడతారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. వాహనం కొనుగోలు చేస్తారు. కీలక పత్రాలు జాగ్రత్త. శనివారం నాడు అందరితో మితంగా సంభాషించండి. ఎదుటివారు మీ వ్యాఖ్యలను తప్పుపట్టే అవకాశం ఉంది. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. కొందరి నిర్లక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఇంటి విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. ఉపాధ్యాయులకు పదవీయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. చిరువ్యాపారులకు సామాన్యం. అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు.

వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు.

అన్ని రంగాల వారికీ అనుకూలమే. స్నేహబంధాలు బలపడతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. బాధ్యతలు అధికమవుతాయి. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. గురువారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం వాటిల్లే సూచనలున్నాయి. పనులు తీవ్రంగా సాగిస్తారు. కన్సల్టెంట్లను ఆశ్రయిస్తారు. తరచు సన్నిహితులతో సంభాషిస్తుంటారు. సంతానం ఉద్యోగయత్నం ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉమ్మడి వ్యాపారాల పట్ల ఆకర్షితులవుతారు. పెద్దమొత్తం ధనం విషయంలో జాగ్రత్త.

మిథునం: మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు.

వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. మీ సమర్థతపై ఎదుటివారికి గురి కుదురుతుంది. సంప్రదింపులు మీ సమక్షంలో సాగుతాయి. ఆదాయం బాగుంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆలయాలు, సేవాసంస్థలకు విరాళాలందిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. బుధవారం నాడు నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. చుట్టుపక్కల వారిని నిశితంగా గమనించండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. ఆప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. సంతానం మొండితనం చికాకుపరుస్తుంది. అప్రమత్తంగా మెలగండి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. హోటల్ వ్యాపారులకు స్వల్ప అభివృద్ధి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వాహన చోదకులకు ఒత్తిడి తగదు.

కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష.

గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. కార్యసాధనలో సఫలీకృతులవుతారు. అప్పుగా ఇచ్చిన ధనం తిరిగి అందుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరంగా గడుపుతారు. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. గురువారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఉపాధ్యాయులకు పదోన్నతి. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.

సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. వ్యవహారంలో సముచిత నిర్ణయం తీసుకుంటారు. స్థిరాస్తి ధనం అందుతుంది. రుణవిముక్తులవుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. శుక్రవారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. కీలక పత్రాలు అందుకుంటారు. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆత్మీయులతో సంభాషిస్తుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. వాహనం, గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. ప్రముఖులను కలవడం సాధ్యపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొండిధైర్యంతో యత్నాలు కొనసాగిస్తారు. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు యధావిధిగా సాగుతాయి. పందాలు, బెట్టింగుల జోలికి పోవద్దు.

కన్య: ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు

కార్యసాధనకు మరింత కష్టపడాలి. పట్టుదలతో యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారిపోతాయి. ఇది ఒకందుకు మంచిదే. మీ కృషి ఫలిస్తుంది. సోమవారం నాడు కొందరి తీరు ఇబ్బంది కలిగిస్తుంది. పనులు అర్ధాంతరంగా ముగిస్తారు. ఖర్చులు విపరీతం. పొదుపు విషయాన్ని ముందుగానే గ్రహిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. గృహమార్పు కలిసివస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తుంటారు. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. నిరుద్యోగుల ఉద్యోగయత్నం ఫలిస్తుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. నూతన పెట్టుబడులు కలిసిరావు. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.

తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు

ప్రతికూలతలు అధికం. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. చిన్న విషయానికి చికాకుపడతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవడం శ్రేయస్కరం. శనివారం నాడు పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఊహించని ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆప్తులు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు మున్ముందు సత్ఫలితాలిస్తాయి. ఉపాధ్యాయులకు స్థానచలనం ఇబ్బంది కలిగిస్తుంది. ఏకాగ్రతతో ఇంటర్వ్యూలకు హాజరుకండి.

వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదాలు

అన్ని విధాలా యోగదాయకమే. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. ఉత్సాహంగా కాలం గడుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ముఖ్యమైన వ్యవహారాలు స్వయంగా చూసుకోండి. ఆదివారం నాడు కొత్త సమస్య ఎదురవుతుంది. అందరితో సున్నితంగా సంభాషించండి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులు, కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. సంతానానికి శుభఫలితాలున్నాయి. దాంపత్య సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అధికారులకు స్థానచలనం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లకు ఆదాయాభివృద్ధి.

ధనుస్సు: మూల, పూర్వాషాఢ 1,2,3,4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం

కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. అవకాశాలు అందివస్తాయి. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. మంగళవారం నాడు అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. ఆప్తులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలేర్పడతాయి. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. తరచు ఆత్మీయులతో సంభాషిస్తుంటారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. చిరు వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ఉపాధ్యాయులకు అదనపు బాధ్యతలు.

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు

స్థిరాస్తి మూలక ధనం అందుతుంది. కొంత మొత్తం పొదుపు చేస్తారు. అనురాగాలు వెల్లివిరుస్తాయి. ఉల్లాసంగా కాలక్షేపం చేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. గురువారం నాడు పనులు అనుకున్నట్లు సాగవు. కొందరి తీరు ఇబ్బంది కలిగిస్తుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహంలో సందడి నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మంచి సంబంధం కుదిరే సూచనలున్నాయి. అవతలి వారి స్థోమతను క్షుణ్ణంగా తెలుసుకోండి. తొందరపడి మాట ఇవ్వవద్దు. మీ జోక్యం అనివార్యం. ఉభయులకూ మీ నిర్ణయం ఆమోదయోగ్యమవుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరం. ఉద్యోగస్తులకు పనిభారం. ప్రైవేటు ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

ఈ వారం పరిస్థితులు కొంతమేరకు కుదుటపడతాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. యత్నాలు మరింత ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. తెగిపోయిన బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సంప్రదింపులు సానుకూలంగా సాగుతాయి. ఒప్పందాల వ్యవహారంలో నిపుణులను సంప్రదించండి. భార్యాభర్తల మధ్య దాపరికం తగదు. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగస్తులకు కొత్త సమస్య ఎదురవుతుంది. అధికారులకు అదనపు బాధ్యతలు. బెట్టింగుల జోలికి పోవద్దు.

మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని అసంతృప్తి ఉంటుంది. ఒంటరిగా గడుపుతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. మీ ఇబ్బందులను సున్నితంగా తెలియజేయండి. చేపట్టిన పనులు ఆలస్యంగా ముగించవలసి వస్తుంది. మీపై శకునాల ప్రభావం అధికం. మనోధైర్యంతో మెలగండి. పరిస్థితులు త్వరలో మెరుగుపడతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది. ఏది జరిగినా మంచికే అని భావించండి. గృహమార్పు కలిసిరాదు. వాహనం, విలువైన వస్తువులు జాగ్రత్త. నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరుకండి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు యధావిధిగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారులకు నిరాశాజనకం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu