Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
2026 కామన్వెల్త్ క్రీడలలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్న ముగ్గురు క్రీడాకారులు

2026 కామన్వెల్త్ క్రీడలలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్న ముగ్గురు క్రీడాకారులు

స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో 2026 జూలై 23 నుండి ఆగస్టు 2 వరకు జరగనున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు ఒదిశా AM/NS ఇండియా జిమ్నాస్టిక్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌కు చెందిన ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారు.
ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలోని ఎనిమిది మంది క్రీడాకారులలో తపన్ మొహంతి, తాపేశ్వరనాథ్ దాస్ మరియు ఒలింపియన్ ప్రణతి నాయక్ అనే ముగ్గురు క్రీడాకారులు ఈ ఒదిశా AM/NS GHPCకి చెందినవారే.

తపన్ మొహంతి మరియు తాపేశ్వరనాథ్ దాస్ పురుషుల ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ (MAG) విభాగంలో భారత పురుషుల జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఒలింపియన్ ప్రణతి నాయక్, మహిళల ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్(WAG) విభాగంలో భారత మహిళల జట్టులో సభ్యురాలిగా ఉన్నారు. ఈ విజయం క్రీడాకారుల అంకితభావం మరియు కృషిని, అలాగే ఒదిశా AM/NS GHPC అందిస్తున్న ప్రపంచ స్థాయి శిక్షణ మరియు సమగ్ర వికాసాన్ని చాటిచెబుతోంది. భారతదేశంలో జిమ్నాస్టిక్స్ క్రీడను ఉన్నత స్థాయికి చేర్చడంలోనూ, యువ ప్రతిభను తీర్చిదిద్దడంలోనూ ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తూనే ఉంది.

AM/NS ఇండియా డైరెక్టర్ & వైస్ ప్రెసిడెంట్- HR & అడ్మినిస్ట్రేషన్ అయిన శ్రీ అశుతోష్ తెలాంగ్ మాట్లాడుతూ ఇలా అన్నారు, మన ఒదిశా AM/NS GHPC నుండి ముగ్గురు అథ్లెట్లు కామన్వెల్త్ గేమ్స్‌లో పోటీపడటం మనకు గర్వకారణం. తపన్ మొహంతి, తాపేశ్వరనాథ్ దాస్, ఒలింపియన్ ప్రణతి నాయక్ మన సెంటర్‌లో మలచిన నైపుణ్యం, క్రమశిక్షణ, దృఢత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నారు. వారి విజయం, మేము ఒదిశాలో నిర్మించిన ప్రపంచ స్థాయి శిక్షణ మరియు సమగ్ర అభివృద్ధి వ్యవస్థకు ప్రతిబింబం. AM/NS ఇండియా తరపున, నేను వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రపంచ వేదికపై వారు తమ ప్రతిభను ప్రదర్శిస్తున్న తరుణంలో వారికి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.

ఒదిశా AM/NS GHPC అథ్లెట్లు, అంతర్జాతీయ కాంటినెంటల్ కప్ 2026, లిస్బన్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఆసియా ఛాంపియన్‌షిప్ 2025, టర్కీలోని అంటాల్యాలో జరిగిన FIG వరల్డ్ కప్ 2025, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ నేషనల్ ఛాంపియన్‌షిప్స్ 2025- 2026 వంటి వివిధ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ మరియు జాతీయ వేదికలలో విజయాలను సాధిస్తూ, ఈ కేంద్రం యొక్క సుస్థిరమైన ప్రదర్శనను మరియు ప్రపంచ స్థాయి పోటీలకు దాని సంసిద్ధతను చాటుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu