Saturday, 23 Jan, 11.41 pm వెబ్దునియా

ఆధ్యాత్మికం
24-01-2021 నుంచి 30-01-2021 వరకూ మీ వార రాశి ఫలితాలు

మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం

కార్యసాధనకు ఓర్పు ప్రధానం. అవకాశాలు చేజారిపోతాయి. పట్టుదలతో వ్యవహరించండి. సంప్రదింపులతో తీరిక వుండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆది, సోమ వారాలలో ఊహించని ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. సాయం చేసేందుకు అయినవారే వెనకాడతారు. అవసరాలు అతి కష్టమ్మీద నెరవేరుతాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఆత్మీయుల సలహా పాటించండి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు హోదా మార్పు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెట్టుబడులు కలిసిరావు. వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు

చాకచక్యంగా వ్యవహరించాలి. మీ నుంచి విషయ సేకరణకు కొంతమంది యత్నిస్తారు. కుటుంబ విషయాలు ఏకరవు పెట్టొద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. మంగళ, బుధ వారాలలో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. పనులు మొండిగా పూర్తిచేస్తారు. రోజూవారీ ఖర్చులే వుంటాయి. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలు, దళారులను విశ్వసించవద్దు. ఆత్మీయుల సలహా పాటించండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. స్టాకిస్టులు, హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారలకు వీడ్కోలు పలుకుతారు. వృత్తి, ఉపాధి పధకాలు సంతృప్తినిస్తాయి. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది.

మిధున రాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థుల తీరును గమనించి మెలగండి. గురు, శుక్ర వారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఖర్చులు అధికం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పొదుపు పథకాలు కలిసివస్తాయి. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. అవివాహితులకు శుభయోగం. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.

కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

సర్వత్రా అనుకూలతలున్నాయి. వ్యవహార దక్షతతో రాణిస్తారు. పరిచయాలు బలపడతాయి. ధనప్రాప్తి, వస్తులాభం పొందుతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పనులు వేగవంతమవుతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. శని, ఆది వారాల్లో నగదు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. గృహ మరమ్మతులు చేపడతారు. సంతాన కదలికలపై దృష్టి పెట్టండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రైవేట్ విద్యా సంస్థలకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. కొత్తగా వచ్చిన అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. పుణ్య, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. అవసరాలు నెరవేరుతాయి. ఒక సమస్య నుంచి బయటపడతారు. అనుకూలతలు నెలకొంటాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకి ఇబ్బంది వుండదు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. బుధ, గురు వారాల్లో పనుల్లో అవాంతరాలు ఎదురవుతాయి. మీ సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. అవివాహితులకు నిరుత్సాహకరం. ఆరోగ్యం బాగుంటుంది. గృహమార్పు అనివార్యం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. షేర్ల క్రయవిక్రయాలు లాభిస్తాయి. క్రీడ, కళాత్మక పోటీలు ఉల్లాసం కలిగిస్తాయి.

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు

అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. కొత్త పనులు ప్రారంభిస్తారు. గృహమార్పు కలిసివస్తుంది. శనివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు ఉత్సాహన్నిస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. హోల్ సేల్ వ్యాపారులకు చికాకులు అధికం. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.

తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

వ్యవహారానుకూలత వుంది. అనుకున్నది సాధిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. పనులు సానుకూలమవుతాయి. గృహంలో స్తబ్దత తొలగుతుంది. వివాహ యత్నాలకు శ్రీకారం చుడతారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. గురువారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. పదువుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. గుట్టుగా వ్యవహరించండి. ప్రముఖులను కలుసుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతిలోపం. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనలు సంతృప్తినిస్తాయి. జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు.

వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట

పట్టుదలతో శ్రమిస్తే చక్కని ఫలితాలుంటాయి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. సోదరులతో సఖ్యతగా మెలగండి. ఎవరినీ తక్కువగా అంచనా వేయవద్దు. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. శుక్ర, శని వారాల్లో అప్రమత్తంగా వుండాలి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. కొంత మొత్తం ధనం అందుతుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు బాధ్యతల మార్పు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. చేతివృత్తుల వారికి ఆశాజనకం. సామాజిక వేడుకల్లో పాల్గొంటారు.

ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం.

అనుకూలతలు నెలకొంటాయి. మానసికంగా స్థిమితపడతారు. ఆదాయం బాగుంటుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆప్తులను కలుసుకుంటారు. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. ఆది, సోమ వారాల్లో ఆప్తుల కలయిక వీలుపడదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పిల్లల చదువులపై దృష్టి పెడతారు. ఆరోగ్యం సంతృప్తికరం. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు.ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వాహనచోదకులకు దూకుడు తగదు.

మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు

వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. ఖర్చులు విపరీతం. రుణ ఒత్తిళ్లు అధికమవుతాయి. ఆప్తుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. మంగళ, బుధ వారాల్లో పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. గృహమార్పు అనివార్యం. అయినవారు మీ అసక్తతను అర్థం చేసుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు ఉపశమనం కలిగిస్తుంది. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. చిరు వ్యాపారులకు కష్టకాలం. సేవా, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. దైవ కార్యంలో పాల్గొంటారు. క్రీడా పోటీలు ఉల్లాసం కలిగిస్తాయి.

కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు

అనుకూలతలు అంతంతమాత్రమే. వివాహ యత్నాలు నిరుత్సాహపరుస్తాయి. గృహంలో ప్రశాంతత లోపిస్తుంది. ఆలోచనలతో సతమతమవుతారు. మనోధైర్యంతో వ్యవహరించండి. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు సద్ధుమణుగుతాయి. ఆత్మీయుల పలకరింపు ఉపశమనం కలిగిస్తుంది. ఆదాయం సంతృప్తికరం. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. సంతానం వైఖరిలో మార్పు వస్తుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. వృత్తి ఉపాధి సామాన్యంగా వుంటాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. సేవా, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు.

మీన రాశి: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

ఈ వారం యోగదాయకం. అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది వుండదు. ఆత్మీయులకు సాయం అందిస్తారు. వ్యవహారానుకూలతకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనుల్లో ఒత్తిడి అధికం. సంతానం పైచదువులపై శ్రద్ధ వహించాలి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. గృహమార్పు అనివార్యం. ఆరోగ్యం కుదుటపడుతుంది. నూతన వ్యాపారాలకు అనుకూలం. పెట్టుబడులు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. ప్రైవేట్ సంస్థ ఉద్యోగులకు కొత్త సమస్యలెదురవుతాయి. మార్కెట్ రంగాల వారు టార్గెట్ అధిగమిస్తారు. ప్రముఖల స్వాగతం, వీడ్కోలు పలుకుతారు.


Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu
Top