Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
24-05-2026 ఆదివారం ఫలితాలు -  సంతోషకరమైన వార్త వింటారు

24-05-2026 ఆదివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

Daily Horoscope

మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం

ప్రణాళికలు వేసుకుంటారు. పెట్టుబడులరు తరుణం కాదు. ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతారు.

ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలిస్తాయి.

వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు

శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. యత్నాలు కొనసాగించండి. అవకాశాలు కలిసివస్తాయి. రావలసిన ధనం అందుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయవద్దు. కీలక అంశాల్లో జాగ్రత్త వహించండి. అందరితో మితంగా సంభాషించండి. బెట్టింగ్‌లకు పాల్పడవద్దు.

మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు

నిర్విరామంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. వాహన సౌఖ్యం పొందుతారు. ఖర్చులు సామాన్యం. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. సంప్రదింపులు ఫలిస్తాయి. చెల్లింపుల్లో జాగ్రత్త, ఆత్మీయులను కలుసుకుంటారు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి.

కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

లావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం. ప్రతి విషయంలోను అప్రమత్తంగా ఉండాలి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. చిన్న విషయానికే చికాకుపడుతారు. ద్విచక్రవాహనంపై దూరప్రయాణం తగదు.

సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

పరిస్థితులు చక్కబడతాయి. ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ప్రముఖులతో పరిచయం కలుగుతుంది. పనులు మందకొడిగా సాగుతాయి. సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి.

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు

సంతోషకరమైన వార్త వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. మీ సాయంతో ఒకరి మేలు జరుగుతుంది. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండండి.

తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 3 పాదాలు

అన్నివిధాలా అనుకూలం. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ధనసహాయం తగదు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. సన్నిహితులతో సంభాషిస్తారు. పెద్దల జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది.

వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదములు

సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. అనుభవజ్ఞుల సలహా పాటిస్తారు. రావలసిన ధనం అందుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. పనులు మందకొడిగా సాగుతాయి. ఆహ్వానం అందుకుంటారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. ధైర్యంగా ముందుకు సాగుతారు.

ధనస్సు : మూల, పూర్వాషాడ 1,2,3,4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం

సన్నిహితులు వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ప్రణాళికలు వేసుకుంటారు. కొత్త పనులు చేపడతారు. నగదు, పత్రాలు జాగ్రత్త. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. విందుకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.

మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు

ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. వ్యవహారానుకూలత ఉంది. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఖర్చులు విపరీతం. అప్రియమైన వార్త వింటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొండిగా యత్నాలు సాగిస్తారు.

కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు

మనోధైర్యంతో మెలగండి. అపజయాలకు కుంగిపోవద్దు. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. పనులు పురమాయించవద్దు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి.

మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి

ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. అందరితోను మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu