Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
25-07-2026 శనివారం ఫలితాలు - మీ అలక్ష్యం సమస్యకు దారితీస్తుంది

25-07-2026 శనివారం ఫలితాలు - మీ అలక్ష్యం సమస్యకు దారితీస్తుంది

25-07-2026 Daily Astrology

మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం

శావహదృక్పథంతో శ్రమించండి. మీ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసుకోవద్దు.

యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. లక్ష్యం సాధిస్తారు. స్థిరాస్తి ధనం అందుతుంది. పనులు వేగవంతమవుతాయి. అనవసర జోక్యం తగదు. దైవదర్శనాల్లో ఒకంత అవస్థలెదుర్కుంటారు.

వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు

లావాదేవీలు కొలిక్కివస్తాయి. ధనలాభం, వాహన సౌఖ్యం పొందుతారు. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మనోధైర్యంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు, కొత్తవ్యక్తులతో మితంగా సంభాషించండి.

మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

సర్వదా అనుకూలం. మీ కృషి ఫలిస్తుంది. లక్ష్యాన్ని సాధిస్తారు. స్థిరాస్తి ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు త్వరితగతిన సాగుతాయి. నోటీసులు అందుకుంటారు. సన్నిహితులను సంప్రదిస్తారు. రాజీ మార్గంలో వివాదాలు పరిష్కారమవుతాయి.

కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

కొన్ని పనులు సునాయాసంగా పూర్తవుతాయి. మీ శ్రీమతి ధోరణి చికాకుపరుస్తుంది. అయిన వారిని ప్రసన్నం

చేసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం పొందుతారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకోండి.

సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

మీ కష్టం ఫలిస్తుంది. పొదుపు ధనం అందుతుంది. ఆత్మీయులు వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. యత్నాలు సాగిస్తారు. మితంగా సంభాషించండి. ఆహ్వానం అందుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కీలక సమావేశంలో పాల్గొంటారు.

కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు

ప్రతికూలతలు అధికం, ఏ విషయంపై ఆసక్తి ఉండదు. చిన్న విషయానికి చిరాకుపడతారు. మీ తప్పులు సరిదిద్దుకోవటం ఉత్తమం. దుబారా ఖర్చులు విఫరీతం. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు వాయిదా పడతాయి. పత్రాల రెన్యువల్‌లో జాప్యం తగదు.

తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

శుభవార్త వింటారు. ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఒత్తిడి తగ్గి కుదుటపడతారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. స్థిరాస్తి ధనం అందుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. పనుల్లో శ్రమ అధికం.

వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు

మీదైన రంగంలో రాణిస్తారు. మీ ఊహలు ఫలిస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి.

ధనస్సు : మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం

అనుకున్న కార్యం నెరవేరుతుంది. మరింత ఉత్సాహంగా కొత్త పనులు చేపడతారు. అందరితోను మితంగా సంభాషించండి. పత్రాల్లో సవరణలు సాధ్యపడవు. పట్టుదలతో మరోసారి ప్రయత్నించండి. ఖర్చులు అధికం. ప్రయాణంలో ఒకింత అవస్థలెదుర్కుంటారు.

మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు

పనులు సానుకూలమవుతాయి. సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. సంతానానికి విద్యావకాశం అభిస్తుంది. స్థిరాస్తుల వ్యవహారంపై దృష్టిపెడతారు. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.

కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు

కార్యసిద్ధి, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. ఖర్చులు అధికం. అర్ధాంతంగా ముగించిన పనులు పూర్తి చేస్తాయి. పత్రాలు రెన్యువల్‌లో జాప్యం తగదు. మీ అలక్ష్యం సమస్యకు దారితీస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి.

మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి

సంప్రదింపులు ఫలిస్తాయి. సముచిత నిర్ణయానికి రాగలుగుతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పనులు హడావుడిగా సాగుతాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu