Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదంకార్యసాధనకు మరింత శ్రమించాలి. ఓర్పుతో పనిచేయండి. అనుమానాలకు తావివ్వవద్దు.
యత్నాలకు సన్నిహితులను సన్నిహితులు ప్రోత్సహిస్తారు. ఖర్చులు సామాన్యం. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. కీలక చర్చల్లో పాల్గొంటారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సత్కాలం సమీపించింది. ఆలోచనలు కార్యరూపంలో పెట్టండి. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. మీ కార్యదీక్ష స్ఫూర్తిదాయకమవుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. పనులు చురుకుగా సాగుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది.
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సర్వత్రా అనుకూలం. అభీష్టం నెరవేరుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. మీ కృషి ఫలిస్తుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
తలపెట్టిన కార్యం సఫలమవుతుంది. ఆటుపోట్లకు దీటుగా స్పందిస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తిచేస్తారు. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇంటి విషయాలపై దృష్టిపెడతారు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. ఓర్పుతో యత్నాలు సాగించండి. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. పత్రాల రెన్యువల్న అశ్రద్ధ చేయకండి.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఆటంకాలెదురైనా ధైర్యంగా ముందుకు సాగుతారు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. ఖర్చులు విపరీతం. వాయిదాల చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. పనులు త్వరితగతిన సాగుతాయి.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
నేడు అనుకూలదాయకం. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. పెద్దల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. ఖర్చులు విపరీతం. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వేడుకకు హాజరవుతారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అభీష్టం నెరవేరుతుంది. ప్రతి విషయంలోను మీదే పైచేయి. కీలక అంశాలపై పట్టుసాధిస్తారు. ప్రముఖులతో పరిచయాల్పేడతాయి. మితంగా సంభాషించండి. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు అర్ధాంతంగా ముగిస్తారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. గృహంలో సందడి నెలకొంటుది. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. అవకాశాలను దక్కించుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. పనులు మొండిగా పూర్తి చేస్తారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. అప్రియమైన వార్త వింటారు. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. వివాదాలు పరిష్కారమవుతాయి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. మీ సమర్థతను తక్కువ అంచనా వేసుకోవద్దు. పెద్దల హితవు మీపై చక్కని ప్రభావం చూపుతుంది. ఖర్చులు సామాన్యం. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. చేపట్టిన పనులు వాయిదా వేసుకుంటారు.

