గ్రహాల సంచారం ప్రతికూలంగా ఉంది. ఆచితూచి అడుగేయండి. అనాలోచిత నిర్ణయం తగదు. దుబారా ఖర్చులు విపరీతం.
చేతిలో ధనం నిలవదు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. గురువారం నాడు చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. మనోధైర్యంతో మెలగండి. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో అనుకూలతలు నెలకొంటాయి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరచరాస్తి వ్యవహారంలో పునరాలోచన శ్రేయస్కరం. ఆప్తుల ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు నిదానంగా సత్ఫలితాలిస్తాయి. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. కిట్టని వారు ఇబ్బందికి గురిచేస్తారు. వృత్తుల వారికి సామాన్యం.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగలం 1,2, పాఠాలు
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. రుణ ఒత్తిడి తగ్గుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. తరచూ ఆత్మీయులతో సంభాషిస్తారు. సోమవారం నాడు పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. మొండిధైర్యంతో ముందుకు సాగుతారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. పత్రాల్లో సవరణలు అనుకూలించవు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అవివాహితులకు శుభయోగం పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి. సన్నిహితుల హితవు మీపై ప్రభావం చూపుతుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ముఖ్యం. కీలక చర్చల్లో పాల్గొంటారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సర్వత్రా కలిసివచ్చే సమయం. కీలక సమస్యలు పరిష్కారమవుతాయి. చాకచక్యంగా మెలుగుతారు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. అర్థాంతంగా నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. ఆదివారం నాడు ఆప్తుల కలయిక వీలుపడదు. దంపతులు ఏకాభిప్రాయానికి రాగలుగుతారు. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. నిశ్చితార్థంలో మెళకువ వహించండి. గృహాలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెట్టండి. ప్రకటనలు, కన్సల్టెన్సీలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ఒక సమాచారం సందిగ్ధానికి గురిచేస్తుంది. సన్నిహితులను సంప్రదిస్తారు. వ్యాపారాలు క్రమంగా పుంజుకుంటాయి. ఉద్యోగ విధుల్లో అలక్ష్యం తగదు. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లక్ష్యానికి చేరదవుతున్నారు. ఉత్సాహంగా యత్నాలు కొనసాగించండి. స్థిరచరాస్తుల మూలక ధనం అందుతుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురైనా ఎట్టకేలకు పూర్తికాగలవు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఆపన్నులకు సాయం చేస్తారు. గురువారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. సంతానం ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగస్తులకు యూనియన్ గుర్తింపు లభిస్తుంది. వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. ప్రముఖుల రాక సంతోషం కలిగిస్తుంది. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పరిచయస్తుల రాకపోకలు అధికమవుతాయి. సోమవారం నాడు కీలక పత్రాలు సమయానికి కనిపించవు. చీటికిమాటికి అసహనం చెందుతారు. మీ శ్రీమతి ధోరణి అసహనం కలిగిస్తుంది. పట్టుదలకు పోవద్దు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. ఆత్మీయులతో సంభాషణ ఊరటనిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. దూరపు బంధువుల ఆహ్వానం అందుకుంటారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. పెట్టుబడులకు అనుకూలం. బెట్టింగుల జోలికి పోవద్దు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. కొంతమొత్తం ధనం అందుతుంది. అవసరాలు తీరుతాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. బుధవారం నాడు అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. మీ ఇష్టాయిష్టాలను ఆప్తుల ద్వారా తెలియజేయండి. సంతానం మొండితనం ఇబ్బంది కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. కీలక పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం అలోచింపచేస్తుంది. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగ విధుల పట్ల ఏకాగ్రత వహించండి. ధనప్రలోభాలకు లొంగవద్దు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యానుకూలత ఉంది. లక్ష్యానికి చేరువలో ఉన్నారు. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలాసాలకు ఖర్చుచేస్తారు. సంస్థల స్థాపనలకు రుణాలు మంజూరవుతాయి. స్థిమితంగా పనులు పూర్తిచేస్తారు. మీ శ్రీమతి ధోరణిలో మార్పు వస్తుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. శుక్రవారం నాడు అప్రమత్తంగా మెలగండి. అపరిచితులతో మితంగా సంభాషించండి. కీలక విషయాలు వెల్లడించవద్దు. సంతానం ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఉద్యోగస్తుల పదోన్నతికీ అధికారులు సిఫార్సు చేస్తారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాలలో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వేడుకలో పాల్గొంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
శుభకార్యం నిశ్చయమవుతుంది. వేదికలు అన్వేషిస్తారు. ఖర్చులు విపరీతం. గృహాలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. ఆదివారం నాడు అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండండి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. నోటీసులు అందుకుంటారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. నూతన వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, తిప్పట అధికం. ఏకాగ్రతతో వాహనం నడపండి.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. కలసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. సందేహాలకు తావివ్వవద్దు. స్నేహసంబంధాలు బలపడతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. సంతానానికి శుభపరిణామాలున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలదుకుతాయి. మంగళవారం నాడు ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. అజ్ఞాతవ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. మీ సమస్యను ఆప్తులకు తెలియజేయండి. అనాలోచితంగా వ్యవహరించవద్దు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. ఒత్తిళ్లకు గురికావద్దు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరమైన అవకాశం లభిస్తుంది. వ్యాపారాల్లో ఆరించిన లాభాలు గడిస్తారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. న్యాయ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 3 పాదాలు
ఈ వారం అనుకూలదాయకం. వ్యవహరాల్లో సరైన నిర్ణయం తీసుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పరిచయస్తులకు సాయం చేస్తారు. పనులు నిరాటంకంగా సాగుతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఒత్తిళ్లకు గురికావద్దు. నిపుణుల సలహా పాటించండి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. కలుపుగోలుగా మెలగుతారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. ఉద్యోగ విధుల పట్ల ఏకాగ్రత వహించండి. ఉపాధి పథకాలు చేపడతారు. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1,2,3 పాదాలు
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. అప్రయత్నంగా అవకాశం కలిసివస్తుంది. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. ఆహ్వానం అందుకుంటారు. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ప్రకటనలు, మధ్యవర్తులను ఆశ్రయించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. అధికారులకు హోదా మార్పు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఏకాగ్రతతో వాహనం నడపండి.
మీనం : పూర్వాబాద్ర 46 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు సామాన్యం. పెద్దమొత్తం ధనసహాయయం తగదు. మీ ఇబ్బందులను సున్నితంగా తెలియజేయండి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. మీ అంగీకారం పెద్దల ద్వారా తెలియజేయండి. మీ శ్రీమతి గురించి ఆందోళన చెందుతారు. పనులు, కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆప్తులతో తరచూ సంభాషిస్తారు. పత్రాల్లో సవరణలు సానుకూలమవుతాయి. ఆదివారం నాడు అందరితోనూ మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తారు. విమర్శలు పట్టించుకోవద్దు. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. నూతన వ్యాపారాలకు అనుకూలం. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. ప్రయాణం తలపెడతారు.

