Dailyhunt
36 రోజులుగా ఇంటర్‌నెట్ లేదు, మరో 48 గంటల్లో బీభత్సం: ఇరాన్ ఏమవుతుంది?!!

36 రోజులుగా ఇంటర్‌నెట్ లేదు, మరో 48 గంటల్లో బీభత్సం: ఇరాన్ ఏమవుతుంది?!!

రాన్. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దేశాలు ఈ దేశంపై సంయుక్త దాడులు ప్రారంభించాయి. ఆరోజున ఇరాన్ దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు బంద్ చేసింది. ఇక అప్పట్నుంచి నేటివరకూ అక్కడ ఇంటర్నెట్ అందుబాటులో లేదు.
ప్రపంచంలో ఏం జరుగుతుందో అనే సంగతి పక్కన పెడితే దేశంలో ఎక్కడ ఏం జరుగుతుందో ఇరాన్ ప్రజలకు తెలియకుండా వుంది. ఇంటర్నెట్ పర్యవేక్షణా సంస్థ నెట్ బ్లాక్స్ అంచనాను బట్టి ఇరాన్ దేశంలో 864 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఇంకా ఎన్నిరోజులకు ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుందో కూడా తెలియదు. ఐతే దేశంలో పరిమిత స్థాయిలో ఇంటర్నెట్ సేవలు వున్నట్లు తెలుస్తోంది కానీ అదికూడా వాస్తవమో కాదో కూడా తెలియడంలేదు. ఇదిలావుంటే ట్రంప్ ఇరాన్ దేశానికి 48 గంటల డెడ్ లైన్ విధించారు.

ఇక ఇరాన్ దేవుడిని తలుచుకోవాల్సిందే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ దేశంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. యుద్ధ విరమణ ఒప్పందం కోసం తను ఇచ్చిన 10 రోజుల గడువు మరో 48 గంటల్లో ముగియబోతోందని, ఐనా ఇరాన్ దేశానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. అందుకే 48 గంటల తర్వాత ఇరాన్ దేశంలో ప్రపంచం ఎన్నడూ చూడనటువంటి బీభత్సం చూపించబోతున్నానని పేర్కొన్నారు. మంగళవారం ఇరాన్ దేశంలో మరణమృదంగం వినిపిస్తాననీ, ఆరోజు విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాలు, పరిశ్రమలు ఇలా ఇరాన్‌కు వెన్నెముక వంటివన్నీ విరిచేస్తామన్నారు.

అలా అన్నీ నాశనమయ్యే దాకా ఇరాన్ దారికి వచ్చేట్లు కనబడటం లేదన్నారు. ఇరాన్ దేశంపైన యుద్ధం చేసేందుకు 50 వేలమంది అమెరికన్ సాయుధ దళాలను పంపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు అధునాతన యుద్ధ విమానాలు ఏ క్షణమైనా టేకాఫ్ అయ్యేందుకు రన్ వే పైన ఇంజిన్లు ఆన్‌లో పెట్టుకుని చూస్తున్నాయి. అటు సైన్యం, ఇటు విమానాలు అంతా కలిసి మంగళవారం నాడు ఇరాన్ దేశంలో బీభత్సం సృష్టించబోతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. తన అధికారిక పేజీ ట్రూత్ లో ఆయన సహనం కోల్పోయి బూతులు సైతం రాశారంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu