Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
4వ త్రైమాసికంలో బలమైన వృద్ధిని ప్రకటించిన ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా

4వ త్రైమాసికంలో బలమైన వృద్ధిని ప్రకటించిన ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా

గురుగ్రామ్: భారతదేశంలో అగ్రగామి సంస్థగా పేరు తెచ్చుకున్న లాజిస్టిక్స్, సప్లై చెయిన్ సొల్యుషన్స్ ప్రొవైడర్ అయినటువంటి ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (TCI), ఇవాళ తన నాలుగో త్రైమాసిక, మార్చి 31, 2026తో ముగిసిన ఆర్థిక సంవత్సర ఫలితాలను ప్రకటించింది.

2026 ఆర్ధిక సంవత్సవం 4వ త్రైమాసికంలో ఫైనాన్షియల్ హైలెట్స్:

ఆదాయం: టీసీఐ రూ. 1,336 కోట్ల ఏకీకృత ఆదాయాన్ని సాధించింది. గతేడాది ఇదే కాలంలో నమోదైన ₹ 1,197 కోట్లతో పోలిస్తే ఇది 11.6% వృద్ధిని సూచిస్తుంది.

EBITDA: వడ్డీ, పన్నులు, తరుగుదల, రుణ విమోచనానికి ముందు కంపెనీ ఆర్జనలు ₹ 174 కోట్లుగా నమోదయ్యాయి; ఇది Q4/FY2025లో ఉన్న ₹ 162 కోట్ల నుండి 7.4% పెరుగుదలగా నమోదైంది.

పన్ను తర్వాతి లాభం(PAT): గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో ₹ 115 కోట్లుగా ఉన్న పన్ను తర్వాతి లాభం, 8.7% వృద్ధితో ₹ 125 కోట్లకు చేరింది.

మేనేజ్ మెంట్ కామెంట్స్

ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వినీత్ అగర్వాల్ గారు మాట్లాడుతూ.. వేగంగా మారుతున్న వ్యాపార వాతావరణంలో టీసీఐ యొక్క స్థిరమైన అమలు, క్రమబద్ధమైన కార్యకలాపాలను FY2026 నాల్గవ త్రైమాసికం ప్రతిబింబించింది. మా వైవిధ్య భరితమైన పోర్ట్‌ ఫోలియో, సమీకృత మల్టీ మోడల్ సామర్థ్యాలు, వినియోగదారుల-కేంద్రీకృత విధానం మా మార్కెట్ స్థానాన్ని మరింత బలోపేతం చేశాయి అని అన్నారు.

వేర్‌హౌసింగ్, మల్టీమోడల్ మూవ్‌మెంట్, రంగాల వారీ లాజిస్టిక్స్ పరిష్కారాలలో టీసీఐ మంచి పురోగతిని సాధించింది. మా త్రీ పీఎల్, కోల్డ్ చైన్ మరియు వేర్‌హౌసింగ్ సేవలు ఎఫ్.ఎమ్.సి.జీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, పునరుత్పాదక ఇంధనం, ఇ-కామర్స్, క్విక్ కామర్స్ రంగాలలోని వినియోగదారులకు సేవలు అందిస్తున్నాయి. వేర్‌హౌస్‌లు, హబ్‌లు, ట్రక్కులు, రైల్ కార్ క్యారియర్‌లలో నిరంతర పెట్టుబడుల మద్దతుతో రైలు, రోడ్డు మరియు తీరప్రాంత షిప్పింగ్‌లో పెరుగుతున్న పురోగతి, పర్యావరణ అనుకూల లాజిస్టిక్స్‌ను ముందుకు తీసుకెళ్లడానికి ఈవీ ట్రక్కులపై మా అన్వేషణతో పాటు, మా దీర్ఘకాలిక సామర్థ్యాలను బలోపేతం చేస్తోంది.

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, మా వినియోగదారులకు, సమాజానికి, వాటాదారులకు శాశ్వత విలువను సృష్టించాలని భావిస్తున్నాం. ఇందుకోసం సాంకేతికత, బహుళ రవాణా మౌలిక సదుపాయాలు, పర్యావరణ అనుకూల లాజిస్టిక్స్, వ్యూహాత్మక భాగస్వామ్యాలలో మా పెట్టుబడులను సద్వినియోగం చేసుకోవడంపై మేము దృష్టి సారించాము.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu