Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆదివారం మీ రాశి ఫలితాలు- అవకాశాలు చేజారినా ఒకందుకు మంచికే అనుకోండి

ఆదివారం మీ రాశి ఫలితాలు- అవకాశాలు చేజారినా ఒకందుకు మంచికే అనుకోండి

Daily Astrology

మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం

క్ష్యానికి చేరువలో ఉన్నారు. ఓర్పుతో యత్నాలు సాగించండి. చెల్లింపుల్లో జాప్యం తగదు.

పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. పనులు ఇతరులకు అప్పగించవద్దు. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. పత్రాలు అందుకుంటారు.

వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు

అనుకున్నది సాధిస్తారు. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఒత్తిడికి గురికావద్దు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు.

మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు అనుకున్నట్లే జరుగుతాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. ముఖ్యుల కలయిక తృప్తినివ్వదు. మనోధైర్యంతో యత్నం కొనసాగిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆహ్వానం అందుకుంటారు.

కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఖర్చులు విపరీతం. రుణాలు, చెక్కులను స్వీకరిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. పరిచయం లేని వారితో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. వాహనం ఇతరులకు ఇవ్వవద్దు.

సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

సంప్రదింపులతో తీరిక ఉండదు. కొత్త యత్నాలు చేపడతారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి ఖర్చు చేస్తారు.

కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు

కార్యసాధనకు మరింత కృషి చేయాలి. మీ కృషిలో లోపం రాకుండా చూసుకోండి. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే లక్ష్యం సాధిస్తారు. స్థిరచరాస్తి ధనం అందుతుంది. బంధుమిత్రులతో సంభాషిస్తారు. సోదరుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి.

తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

ధృఢసంకల్పంతో పురోగతికి శ్రమించండి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. చెల్లింపుల్లో జాప్యం తగదు. మీ కాలయాపన ఇబ్బంది కలిగిస్తుంది. ఆప్తుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త.

వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1, 2, 3, 4 పాదములు

మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. స్థిరచరాస్తి ధనం అందుతుంది. ఆలయాలకు విరాళాలు, కానుకలు అందిస్తారు. అర్థాంతరంగా ముగించిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ఇతరులతో మితంగా సంభాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు.

ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం

ఓర్పు, పట్టుదలతో శ్రమించండి. సాయం ఆశించవద్దు. యత్నాలను సన్నిహితులు ప్రోత్సహిస్తారు. ఖర్చులు విపరీతం. నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. పనులు మందకొడిగా సాగుతాయి. ప్రముఖులను కలిసినా ఫలితం ఉండదు. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి.

మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు

గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది. అవకాశాలు చేజారిపోతాయి. చెల్లింపుల్లో జాప్యం తగదు. పరుల బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఆస్తుల గురించి సంభాషిస్తారు. గృహమార్పు అనివార్యం. వాహనదారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి.

కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు

లక్ష్యం సాధించేవరకు శ్రమించండి. ఇతరుల వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. కొంతమొత్తం ధనం అందుతుంది. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. చిట్‌ఫండ్స్, ఫైనాన్స్ రంగాల జోలికి పోవద్దు. పనులు ఒక పట్టాన సాగవు. చీటికిమాటికి అసహనం చెందుతారు.

మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి

ఆశావహదృక్పథంతో మెలగండి. అవకాశాలు చేజారినా ఒక విధంగా మంచికే అనుకోండి. యత్నాలు కొనసాగించండి. విలాసాలకు ఖర్చు చేస్తారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ఒక పట్టాన సాగవు. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu