ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలెర్ట్ ఇచ్చింది. అదేమిటంటే... మరో 48 గంటల్లో కేరళ రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు తాకనున్నట్లు తెలియజేసింది.
దక్షిణ కోస్తాలో ఈదురుగాలులు తీవ్రంగా విస్తాయని, ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచన చేసారు. వర్షం కురిసే సమయంలో పిడుగులు పడవచ్చు కనుక పక్కా ఇళ్లలో తలదాచుకోవాలనీ, చెట్ల కింద- మైదానం వంటి ప్రాంతాల్లో వుండరాదని అధికారులు సూచిస్తున్నారు.

