Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆన్‌లైన్‌‍ గేమ్‌లో పరిచయం - కిడ్నాప్ బాలికను సురక్షితంగా రక్షించిన తల్లీకొడుకు

ఆన్‌లైన్‌‍ గేమ్‌లో పరిచయం - కిడ్నాప్ బాలికను సురక్షితంగా రక్షించిన తల్లీకొడుకు

ఆన్‌లైన్ గేమ్‌లో ఏర్పడిన పరిచయం ఒకయేడాది కాలంగా అపహరణకుగురై గృహ నిర్బంధంలో ఉన్న బాలికను రక్షించేందుకు దోహదపడింది. ఆ బాలిక అమెరికాలోని కొలరాడోకు చెందిన 16 ఏళ్ల బాలుడు, అతడి తల్లి చాకచక్యంగా వ్యవహరించి విడిపించారు.
వారికి ప్రభుత్వ అధికారులు సైతం సహాయపడ్డారు. ఈ సంఘటన అమెరికాలోని ఒరెగాన్‌లో చోటుచేసుకుంది.

2025 మే నెలలో ఉటాలోని గార్డెన్ సిటీ నుంచి 15 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. ఆమె 'అమంగ్ అప్' అనే ఆన్‌లైన్ గేమ్ ఆడుతున్నప్పుడు కొలరాడోకు చెందిన 16 ఏళ్ల లాండన్ ట్రెస్‌తో పరిచయం ఏర్పడింది. డిస్కార్డ్ యాప్‌లో వీరి మధ్య సంభాషణలు కొనసాగాయి. ఈ క్రమంలో, తాను ఒక వ్యక్తి వద్ద బందీగా ఉన్నానని, అతడి చెర నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నానని ఆమె లాండన్‌కు చెప్పింది. తన మిస్సింగ్ కేసుకు సంబంధించిన లింకులను కూడా పంపింది. ఈ విషయాన్ని లాండన్ అక్టోబరు 31న తన తల్లి క్రిస్టినా ట్రెస్‌కు తెలియజేశాడు.

వృత్తిరీత్యా నర్స్ అయిన 41 ఏళ్ల క్రిస్టినా వెంటనే రంగంలోకి దిగింది. ఆమె ఆ బాలికతో మాట్లాడి, ఒరెగాన్‌లోని ఓ నగరంలో ఉన్నట్లు తెలుసుకుంది. పబ్లిక్ అందుబాటులో ఉన్న ప్రాపర్టీ రికార్డులు, రియల్ ఎస్టేట్ ఫొటోల ఆధారంగా ఆమె చిరునామాను గుర్తించింది. ఆ తర్వాత బాలిక తల్లితో పాటు ఎఫ్.బి.ఐని సంప్రదించింది.

ఎప్.బి.ఐ పర్యవేక్షణలో జరిగిన ఫోన్ కాల్లో, 39 ఏళ్ల ఆడమ్ హంటర్ హార్మెల్ అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో పరిచయమై డబ్బు ఆశ చూపి తనను ఉటా నుంచి ఒరెగాన్‌లోని తన ఇంటికి తీసుకెళ్లాడని, ఫోన్ పడేసి నిర్బంధించాడ వివరించింది. నవంబరు 1న హార్మెల్ ఇంట్లో లేని సమయంలో, క్రిస్టినా ఫోనులో మార్గనిర్దేశం చేయడంతో బాలిక ఇంటి నుంచి బయటకు వచ్చింది. అక్కడే సిద్ధంగా ఉన్న పోలీసులు ఆమెను సురక్షితంగా రక్షించారు. అనంతరం హార్మెల్‌ను ట్రాఫిక్ స్టాప్ వద్ద అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితుడు అదుపులో ఉన్నాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu