Dailyhunt
ఆప్‌కు డబుల్ షాక్.. బీజేపీలోకి రాఘవ్ చద్దా... అశోక్ మిట్టల్ జంప్

ఆప్‌కు డబుల్ షాక్.. బీజేపీలోకి రాఘవ్ చద్దా... అశోక్ మిట్టల్ జంప్

రవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ పార్టీకి డబుల్ షాక్ తగిలింది. ఆ పార్టీ సస్పెండ్ వేటు వేసిన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాతో పాటు మరో నేత అశోక్ మిత్తల్ సైతం భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు.
నిజానికి రాజ్యసభలో ఉప నేతగా ఉన్న రాఘవ్ చద్దాపై ఆప్ వేటు వేసింది. ఆ హోదాలో మరో రాజ్యసభ సభ్యుడైన అశోక్ మిత్తల్‌ను ఎంపిక చేసింది. ఇపుడు ఆయన కూడా రాఘవ్ చద్దాతో కలిసి భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. ఇది ఆప్‌కు డబుల్ షాక్‌ తగినట్టయింది.

ఈ హఠాత్ పరిణామంపై ఆప్ కన్వీర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ, బీజేపీ తన చర్యలతో మరోసారి పంజాబీలను గట్టి దెబ్బ కొట్టిందని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఆ పార్టీ ఆపరేషన్‌ లోటస్‌ను మళ్లీ మొదలుపెట్టిందని ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ అన్నారు. తమ ఏడుగురు ఎంపీలను ప్రలోభపెట్టడానికి భాజపా ఈడీ, సీబీఐలను వాడుకుందని ఆరోపించారు.

'రోజు ఏడుగురు ఆప్‌ ఎంపీలు భాజపాలో చేరారు. తమను మోసం చేసిన వారిని ప్రజలు ఎప్పటికీ క్షమించరు. రాఘవ్‌ చద్దాను పార్టీ ఎమ్మెల్యే, ఎంపీని చేసింది. పంజాబ్‌ ప్రజలు సందీప్‌ పాఠక్‌ను ప్రేమతో రాజ్యసభకు పంపారు. రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్నీ, అశోక్ మిట్టల్‌, స్వాతి మాలీవాల్‌.. వీరందరికీ పార్టీ, పంజాబ్‌ ప్రజలు దిగువస్థాయి నుంచి ఉన్నత స్థానాలకు చేరుకొనే అవకాశం కల్పించారు. వారి ఆశీస్సుల వల్లే హర్భజన్‌ సింగ్‌కు కూడా పార్లమెంటులో అడుగుపెట్టే అవకాశం లభించింది. కానీ, ఈ ఏడుగురూ రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచారు'అని సంజయ్‌ సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu