ఈరోజుల్లో ఆరోగ్యం మీద చాలా చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఏదైనా అనారోగ్యం వచ్చిందీ అంటే ఇక ఆసుపత్రుల గుంజుడు అలా ఇలా వుండదు.
రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఎండు ఖర్జూరాలను పాలతో కలిపి తీసుకుంటూ వుండాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి ఐరన్ అందుతుంది. ఫలితంగా శరీరంలో రక్తప్రసరణ మెరుగై హిమోగ్లోబిన్ శాతం వేగంగా పెరుగుతుంది.
అలాగే దంతాలు, ఎముకల దృఢత్వం కోసం ఎండుఖర్జూరాలను పాలతో తీసుకోవాలి. పాలలో క్యాల్షియం, విటమిన్ డి, ఖర్జూరాల్లో మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం వుండటం వల్ల ఎముకలు, కీళ్లు దృఢంగా మారుతాయి. కీళ్ల నొప్పులు వంటి సమస్యలు దరిచేరవు.
పాలలో వుండే ట్రిఫ్టోఫాన్, ఖర్జూరాలలోని పోషకాలు నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి రాత్రి వేళల్లో ప్రశాంతమైన నిద్ర పట్టేట్లు చేస్తాయి. అలాగే మిల్క్ డేట్స్ తినడం వల్ల సీజనల్ వ్యాధులను కూడా అడ్డుకుంటాయి. ఐతే మధుమేహం వ్యాధి వున్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి.

