Dailyhunt
ఆటో డ్రైవర్ నుంచి అసెంబ్లీకి వెళ్తోన్న దాము.. అదే రూటులో విజయ్ కారు డ్రైవర్ కుమారుడు

ఆటో డ్రైవర్ నుంచి అసెంబ్లీకి వెళ్తోన్న దాము.. అదే రూటులో విజయ్ కారు డ్రైవర్ కుమారుడు

Vijay_Damu

మిళనాడు రాజకీయాల్లో సామాన్యులు సైతం ఎమ్మెల్యేలుగా మారారు. ఈ క్రమంలో రాయపురం నుండి ఆటో డ్రైవర్ విజయ్ దాము సంచలన విజయం సాధించారు.
ఈ మేరకు ఈ టీవీకే అభ్యర్థి దాము డీఎంకే అభ్యర్థిని 14,000 ఓట్ల భారీ ఆధిక్యంతో ఓడించారు.

మొదటి నుండి విజయ్‌కు వీరాభిమాని అయిన ఆయన, వీధుల్లో ఆటో నడుపుతూ ప్రస్తుతం అసెంబ్లీకి చేరుకున్నారు. తద్వారా ఆయన యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఆయన విజయం, నేటి తమిళనాడు రాజకీయాల్లో సామాన్య ప్రజలలో విజయ్‌కి పెరుగుతున్న ఆదరణకు, భావోద్వేగ అనుబంధానికి నిదర్శనం.

ఈ ఎన్నికల్లో విజయ్ మాజీ కారు డ్రైవర్ తనయుడు శబరినాథన్‌పై అందరి చూపూ నిలిచింది. ఓ సాధారణ వ్యక్తికి టికెట్ ఇచ్చారు విజయ్. డీఎంకేకు పట్టం కట్టే విరుగంబాక్కం నియోజకవర్గంలో ఆయనను నిలబెట్టారు. ఓ సాధారణ కారు డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, పైగా అది విరుగంబాక్కం సీట్ కావడం అప్పట్లో సంచలనం రేపింది.

Vijay - Car Driver son

అయితే ఈ నమ్మకమే ప్రస్తుతం ఆయన్ని గెలిపించింది. విరుగంబాక్కంలో శబరినాథన్ భారీ ఆధిక్యత సాధించారు. శబరీనాథన్.. విజయ్ వ్యక్తిగత కారు డ్రైవర్ రాజేంద్రన్ తనయుడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu