Man Crime
కన్నబిడ్డను కనికరం లేకుండా కడతేర్చాడు ఓ తండ్రి. తప్పుచేస్తే మందలించాల్సి పోయి కోపంతో ఊగిపోయాడు. ఆటో సీట్ కవర్ చింపాడన్న కోపంతో కన్నకొడుకు అని కూడా చూడకుండా ఇనుప చువ్వలు, అట్లకాడతో ఒళ్ళంతా వాతలు పెట్టి రాక్షసంగా ప్రవర్తించాడు.ప్రతిపాడు మండలం వామ్మంగి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. ఆ బాలుడు ఆడుకుంటూ తెలియక ఆటో సీటు కవర్‌ను చింపేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి.. చిన్న పిల్లాడని కూడా చూడకుండా ఇంట్లో ఉన్న అట్లకాడ, ఇనుప చువ్వను వేడి చేసి బాలుడి ముఖం, కాళ్లు, చేతులు, శరీర భాగాలపై ఎక్కడ పడితే అక్కడ వాతలు పెట్టాడు.
ఒళ్లంతా వాతలు తేలిన బాలుడు ఆ మంటను భరించలేక ఏడుస్తూ కేకలు వేశాడు. స్థానికుల జోక్యం చేసుకుని ఆ బాలుడిని ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సైకో తండ్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

