Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అద్భుత డ్యాన్స్ టాలెంట్‌తో అదరగొట్టిన బాలయ్య చిన్న కుమార్తె (వీడియో)

అద్భుత డ్యాన్స్ టాలెంట్‌తో అదరగొట్టిన బాలయ్య చిన్న కుమార్తె (వీడియో)

టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని తన అద్భుతమైన డ్యాన్స్ టాలెంట్‌తో ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె ఓ పాటకు డ్యాన్స్ చూసిన ప్రతి ఒక్కరూ ఔరా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా ప్రచారానికి, సినిమా వెలుగులకు దూరంగా ఉండే తేజస్విని.. ఇంత గొప్పగా డ్యాన్స్ చేయడంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ వీడియోలో, ఓ పాపులర్ పాటకు తేజస్విని ఎంతో సమన్వయంతో, ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. తేజస్విని ముఖంలో చక్కటి హుందాతనం, ఎనర్జీ కనిపించాయి. ఆమె హుషారైన డ్యాన్స్ తాజాగా, చూడముచ్చటగా ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.

66 ఏళ్ల వయసులోనూ తన ఎనర్జిటిక్ డ్యాన్సులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించే బాలయ్యకు తేజస్విని కూతురుకావడంతో, ఆమెకు ఈ టాలెంట్ రావడం సహజమేనని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. గతంలో తేజస్విని ఓ టెలివిజన్ యాడ్‌లో కనిపించినప్పటికీ, నటన వైపు రాలేదు. ఇప్పుడు ఈ డ్యాన్స్ వీడియోతో నందమూరి కుటుంబంలో మరో టాలెంట్ బయటపడిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ప్రముఖ విద్యావేత్త, మాజీ టీడీపీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనవడైన శ్రీ భరత్‌ను తేజస్విని దశాబ్దం క్రితం వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి కుటుంబ కార్యక్రమాలకు మాత్రమే పరిమితమైన తేజస్విని, ఇలా అకస్మాత్తుగా తనలోని డ్యాన్స్ ప్రతిభను బయటపెట్టడం నందమూరి అభిమానులకు ఆనందాన్ని పంచుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu