Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అరుదైన ప్రపంచ రికార్డును నెలకొల్పిన భారత టెస్ట్ క్రికెట్ జట్టు

అరుదైన ప్రపంచ రికార్డును నెలకొల్పిన భారత టెస్ట్ క్రికెట్ జట్టు

భారత టెస్ట్ క్రికెట్ జట్టు అరుదైన రికార్డును నెలకొల్పింది. వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌‍లో భారత్ ఈ రికార్డును నెలకొల్పింది.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఏడు వికెట్లకు 50 పరుగులకు పైగా భాగస్వామ్యాలు నమోదు చేసిన ఏకైక జట్టుగా నిలిచింది. అంతేకాకుండా, ఈ మ్యాచ్ భారత్ మరిన్ని రికార్డులను బద్దలు కొట్టింది.

న్యూజిలాండ్‌పై టెస్టుల్లో ఇదే అత్యధిక ఇన్నింగ్స్ స్కోరు. 1995లో ఇదే మైదానంలో వెస్టిండీస్ చేసిన 660/5 పరుగుల రికార్డును భారత్ అధిగమించింది. అలాగే, న్యూజిలాండ్ గడ్డపై కూడా ఇదే అత్యధిక టెస్టు స్కోరు కావడం విశేషం. 2019లో బంగ్లాదేశ్‌కు న్యూజిలాండ్ చేసిన 715/6 పరుగుల రికార్డును కూడా బ్రేక్ చేసింది.

ఒకే టెస్ట్ ఇన్నింగ్స్‌లో ఏడు లేదా అంతకంటే ఎక్కువ 50 పరుగుల భాగస్వామ్యాలను నమోదు చేయడం భారత్‌కు ఇది రెండోసారి. గతంలో 2007లో లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌పై జరిగిన టెస్టులో టీమిండియా ఈ ఘనత సాధించింది. మొత్తం మీద తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన భారత్, ఈ మ్యాచ్‌లో పటిష్ట స్థితిలో నిలిచింది.

వెల్లింగ్టన్ టెస్ట్‌‍ మ్యాచ్ : 352 పరుగుల ఆధిక్యంలో భారత్

న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టు ఆతిథ్య కివీస్‌పై పై చేయిసాధించింది. ఇప్పటివరకు జరిగిన టీ20, వన్డే మ్యాచ్‌ సిరీస్‌లను కైవసం చేసుకుంది. ఇపుడు వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో కూడా పైచేయి కనబరిచింది. తొలి టెస్టులో పరుగుల వరద పారించించింది. ఈ మ్యాచ్‌లో 9 వికెట్ల నష్టానికి 720 పరుగుల భారీ స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఫలితంగా ఆతిథ్య కివీస్‌పై 352 పరుగుల ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది.

భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (136), రిషబ్ పంత్ (128) అద్భుత శతకాలతో కదం తొక్కగా, కెప్టెన్ శుభ్ మన్ గిల్ (98) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. యశస్వి జైస్వాల్ (85), దేవదత్ పడిక్కల్ (80), ధ్రువ్ జురెల్ (78) అర్ధ శతకాలతో రాణించారు.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ టామ్ లాథమ్ (0) ఖాతా తెరవకుండానే జస్రీత్ బుమ్రా బౌలింగ్ వికెట్ కీపర్ పంచ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu