Dailyhunt
బంగ్లాదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం - 6 గంటలకే దుకాణాలు బంద్

బంగ్లాదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం - 6 గంటలకే దుకాణాలు బంద్

మెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య సాగుతున్న యుద్ధం నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తల నేపథ్యంలో ఇంధన కొరతను అధికమించేందుకు అన్ని దుకాణాలు, షాపింగ్ మాల్స్‌ సాయంత్రం 6 గంటలకే మూసివేయాలని ఆదేశాలు జారీచేసింది.
మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పని గంటలను సైతం ఓ గంట తగ్గించింది. ఇక మీదట సాయంత్రం ఐదు గంటలకు బదులు 4 గంటలకే అన్ని కార్యాలయాలు మూసివేయాలని ఆదేశించింది.

అలాగే, బ్యాంకింగ్ లావాదేవీలు సైతం ఉదంయ 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే అనుమతించనున్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత బ్యాంకులు కూడా మూతపడనున్నాయి. హోటళ్లు, ఫార్మసీలు, అత్యవసర సేవలు, నిత్యావసర వస్తు మార్కెట్లు మాత్రం ఈ ఆంక్షల నుంచి మినహాయింపు నిచ్చారు. ఈ మేరకు బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలో జరిగిన బంగ్లా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు, బంగ్లాదేశ్ విజ్ఞప్తి మేరకు భారత్ 5 వేల టన్నుల డీజిల్‌ను ఆ దేశానికి సరఫరా చేసింది. రాబోయే నాలుగు నెలల్లో మరో ఐదు వేల టన్నుల డీజిల్‌ను సరఫరా చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. ఈ విన్నపాన్ని పరిశీలిస్తున్నట్టు భారత విదేశీ వ్యవహరాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్‌దీర్ జయస్‌వాల్ వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu