వివరాల్లోకి వెళితే... బేగంగంజ్‌లోని హిమోటియా గ్రామానికి చెందిన రాజేంద్ర.. రెండు రోజుల క్రితం భార్య జ్యోతి, కుమారుడిని వెంటపెట్టుకుని షాపుకు వెళ్లాడు. మొబైల్ కొనిపెడతానని తీసుకెళ్లి.. మార్గమధ్యంలో వారిని హైదర్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ భార్యతో గొడవపడి, ఆమె తలపై బండరాయితో మోది దారుణంగా హత్య చేశాడు. అనంతరం కన్నకొడుకని కూడా చూడకుండా ఆ చిన్నారిని అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలో రాజేంద్రను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బయటపడింది. వెంటనే 12 పోలీస్ స్టేషన్ల సిబ్బందితో భారీ బృందాలను ఏర్పాటు చేసి, డ్రోన్లు, డాగ్ స్క్వాడ్‌లు, టార్చి లైట్ల సహాయంతో రాత్రంతా గాలింపు చేపట్టారు. సుమారు 10 గంటల వెతుకులాట తర్వాత, తెల్లవారుజామున ఓ పొద సమీపంలో బాలుడు కనిపించాడు. ఆకలి, దాహంతో నీరసించి, భయంతో వణికిపోతున్న ఆ చిన్నారిని పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉంది.

